బక్క చిక్కిన ప్రభాస్ లా ఉన్నాడంటున్నారు
హైదరాబాద్ : హఠాత్తుగా చూస్తే ప్రభాస్ అనుకున్నాం...అయినా మిర్చి ఫస్ట్ లుక్ ని, గెటప్ ని యాజటీజ్ ఎత్తేసాడేంటి ఇదీ గోపీచంద్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ పై సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వినిపిస్తున్న విమర్శలు. బక్క చిక్కిన ప్రభాస్ లా ఉన్నాడని కొందరు విమర్శిస్తే...మరికొందరు గోపీచంద్...కూల్ లుక్ లో ఉన్నాడని మెచ్చుకుంటున్నారు.
చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ కథకు ఓకే చెప్పారు గోపీచంద్. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈనెల 6న చిత్రీకరణ ప్రారంభమైంది. ఈనెల 21 వరకూ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ''మిర్చి తరవాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది'' అని నిర్మాతలు చెప్తున్నారు.
అలాగే .. ''యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. చంద్రశేఖర్ యేలేటి దగ్గర పనిచేసిన రాధాకృష్ణకుమార్ తయారు చేసిన కథ, కథనాలు చాలా బాగున్నాయి. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. జూన్ 6 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము''అన్నారు. చలపతిరావు, బ్రహ్మానందం, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: శక్తిశరవణన్


Click it and Unblock the Notifications











