పవన్ పాత్ర ‘కామన్ మ్యాన్’కాన్సెప్ట్ తో.....
హైదరాబాద్ : ఆ మధ్యన పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకంటే...పవన్ తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ట్రైలర్స్ లో పవన్ కామన్ మ్యాన్ కాదు క్యామన్ మ్యాన్ హీరో అని కట్ చేసారు. దాంతో ఈ చిత్రంలో కామన్ మ్యాన్ ప్రొటక్షన్ సెల్ గురుంచి అంశాలేమైనా ఇన్సర్ట్ చేస్తారేమో అని కొందరు అభిమానులు ఆసిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ట్రైలర్స్, పోస్టర్స్ కూడా ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...'నా చావు కొన్ని కోట్ల మందిని భయపెట్టొచ్చు కానీ ఒక్కడికి కోపమొస్తే చాలు నువ్వు అయిపోతావ్' అంటూ విలన్ విసిరిన సవాల్‌కి సమాధానమే రాంబాబు. ఈ రాంబాబు 'కామన్ మ్యాన్'. వృత్తి జర్నలిజం. నిఖార్సయిన జర్నలిస్ట్ కాబట్టి చెడుని ఏరిపారేయడానికి కంకణం కట్టుకుంటాడు అన్నారు. రాంబాబు పాత్రను పవన్ కళ్యాణ్ పోషించగా, యూనివర్శల్ మీడియా పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'.
ఈ చిత్రం కథ గురించి వార్త ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమైపోతాడు రాంబాబు. తన విధికి ఎంతటివాళ్లు ఎదురొచ్చినా లెక్క చేయడు. బడా బాబుల బండారాల్ని బయటపెడతాడు. వార్తా ఛానళ్ల దృష్టిలో రాంబాబు ఓ హీరో. అతని కథేంటో 'కెమెరామెన్ గంగతో రాంబాబు'లో చూడాల్సిందే అన్నారు యూనిట్ సభ్యులు. ముఖ్యంగా ఈ చిత్రం యు.ఎస్ లో ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య స్వయంగా మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..తాను యు.ఎస్ లో ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేస్తున్నానని, అక్కడ $ 260 k కి పదమూడు సెంటర్లు అమ్ముడుపోయిందని అన్నారు. ఇది యుఎస్ లో ఓ తెలుగు చిత్రానికి వచ్చిన హైయిస్ట్ ప్రైస్ అని ఇప్పటివరకూ ఈ రేంజి బిజినెస్ ఏ చిత్రానికి జరగలేదని అన్నారు.
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ 'పవన్‌తో తొలిసారి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పైగా లీడ్ క్యారెక్టర్ గంగ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న చిత్రం' అన్నారు. ప్రకాష్‌రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











