డాన్స్ల్ ల్లో జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే నేనే బాగా చేస్తాను!
హరోయిన్ కైనా, హీరోకైనా గ్లామర్ ఇండస్ట్రీలో అందానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. హీరోయిన్లయితే గ్లామర్ కోసం రకరకాలుగా మెయిన్‌టైన్ చేస్తారు. ఇక మగవారు అందగాడైతే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ అందాన్ని చూసి మనసుపడి, ముచ్చటపడిన భామలు ఎంతోమంది.
ఇప్పటి జనరేషన్‌లో మహేష్ బాబు హ్యాండ్సమ్ అంటారు. అందుకే కాబోలు ప్రిన్స్ అనే బిరుదును కొట్టేశాడనుటలో ఆశ్చర్యం లేదు. మహిళల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఎక్కువే. ఇక మగవారు కూడా ఆ అందాన్ని చూసి కాస్త ఈర్ష్య పడినవారూ లేకపోలేదు. ఇటీవలే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తన మనసులోని మాటను బయటపెట్టరు.
డాన్స్ విషయంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కంటే ఎవరు బాగా చేయగలరని అడిగితే...వారిద్దరికంటే నేనే బాగా చేయగలనని అని సమాధానమిచ్చారు. మహేష్ బాబు గురించి వచ్చేసరికి...ఇప్పటి తరమంతా గొప్ప నటులే. బాగా చేస్తున్నారు అంటూ...మహేష్ అందంలో కొంచెమైనా నాకు ఇస్తే ఎంతో బావుండేది...అంటూ ఫక్కున నవ్వేశారు. ప్రస్తుతం రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా సూపర్ గుడ్ 'మెరుపు" చిత్రం నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











