వినాయక్ డైరెక్షన్ కి పోటీ పడుతున్న చిరు-రామ్ చరణ్..?
చిరంజీవి 150వ సినిమా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆమధ్య చిరంజీవి 150వ సినిమా స్టార్ట్ కాబోతోందని తెగ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ విషయం అందరూ మర్చిపోయారు. లేటెస్ట్ గా చిరంజీవి మేకప్ వేసుకోవాలనుకుంటున్నాడని మెగా కాంపౌండ్ నంచి సమాచారం అందుతోంది. 'ఠాగూర్" వంటి సూపర్ హిట్ సినిమా చేసిన వినాయక్ అంటే చిరంజీవికి ఎంతో అభిమానం. అందుకే తన 150వ సినిమాకి అతన్నే డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నాడట.
ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న 'రచ్చ"పూర్తి కాగానే వినాయక్ డైరెక్షన్ లో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ, వినాయక్ ఫస్ట్ చిరంజీవి సినిమాకే ఫ్రిఫరెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే రామ్ చరణ్ సినిమా ఉంటుందట. అయితే గతంలో బద్రీనాథ్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నట్టు అందుకు ఆ సినిమా టైటిల్ 'చెర్రీ" అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చెర్రీ కి చెక్ పెట్టి చిరుకి కమిటయ్యారు వినాయక్. ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి సినిమాకి సంబంధించి రెగ్యులర్ గా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నట్టు సమాచారం. మరి ఈసారైనా చిరంజీవి సినిమా స్టార్ట్ అవుతుందంటారా..


Click it and Unblock the Notifications











