'మగధీర' కథ పై కంప్లైంట్
రామ్ చరణ్ హీరోగా రూపొందిన "మగధీర" కథ తనదేనంటూ ఎస్పీచారి అనే రచయిత క్లెయిమ్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే.అయితే దర్శక,నిర్మాతల వైపు నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేకపోవటంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఏపీ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఓ కంప్లైంట్ ధాకలు చేసారని తెలిసింది.
తాను రాసిన చందేరి నవలకు ఇది మక్కికి మక్కి కాపీ అని, తన నవల ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్ గా 2002 లో ప్రచురితమైందని, దానికి పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చారి ఆస్ట్రేలియా నుంచి పంపిన ఇ-మెయిల్ లో పేర్కొన్నారు.ఈ ప్రేమగాధ మధ్యప్రదేశ్ చందేరిలో నాలు వందల ఏళ్ళ క్రితం నిజంగా జరిగిందని, అప్పుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న జంట ఇప్పుడు మళ్ళీ పుట్టి మళ్ళీ కలుసుకుని ప్రేమను సఫలం చేసుకుంటారని చారి చెప్పారు. తన నవలలో ఇదే ఉందని, దీనిని కాపీ కొట్టిన విషయాన్ని నిర్మాత అరవింద్ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని ఆయన తన మెయిల్ లో పేర్కొన్నారు. ఎస్పీ చారి అనే పేరుతో తాను ఈ నవల రాశానని, అది ఇటీవల పుస్తక రూపంలో కూడా వచ్చిందని తెలియజేశారు.
గతంలో కూడా రాజమౌళి డైరక్ట్ చేసిన సింహాద్రి చిత్రానికి కూడా ఇలానే కథా పరంగా వివాదం చెలరేగింది. చివరకు ఆ కథ జి.యస్.రావు అనే రైటర్ దేనని ఒప్పుకుని పరిహారం చెల్లించారని అప్పుడు చెప్పుకున్నారు. జి.యస్.రావు తదనంతరం ఎన్టీఆర్ కి 'సాంబ' చిత్రం కథ అందించారు. అంతేగాక ప్రస్తుతం సురేష్ బాబు కుమారుడు రాణా చిత్రానికి డైరక్షన్ చేస్తున్నారు.
ఇక మగధీర చిత్రం కథ గురించి బయిట రకరకాల కథనాలు వినపడుతున్నయి. వాటిల్లో ఒకదాని ప్రకారం కాలభైరవ గా రామ్ చరణ్ కనపడతారు. అతని ప్రేయసి ఓ రాకుమార్తె. ఐతే కాలభైరవను ఎలాగైనా అంతం చేసి అతని ప్రేమను భగ్నం చేసేందుకు అంతఃపురంలోనే కుట్రలు జరుగుతుంటాయి. కాలభైరవ సవతి సోదరుడే (శ్రీహరి) ఇందుకు సూత్రధారి. ఆ కుట్రకు గురై తమ ప్రేమను పండించుకోలేక పోయిన కాలభైరవ, అతని ప్రియురాలు మరో జన్మ ఎత్తుతారు. కాలభైరవ ఒక స్టంట్ మన్ గా, ప్రిన్స్ ఓ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ తిరిగి కలుస్తారు. ఆ కాలంలో ఈ ఇద్దరి ప్రేమ జంటను విడిదీసిన సవతి సోదరుడే ఈ జన్మలో వారిద్దరినీ కలుపుతాడు.


Click it and Unblock the Notifications











