Ram Charan 17 శాంత్ నీల్ తో కాదా? దసరా సోషల్ మీడియా పోస్టుల వెనుక ఆంతర్యం అదేనా?
దసరా రోజున రామ్ చరణ్ నుంచి రెండు సినిమాల ప్రకటనలు వచ్చాయని మెగా అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో ఒకటి సినిమా ప్రకటన కాగా మరొక సినిమా ప్రకటన విషయంలో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. రామ్ చరణ్ 16వ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు కానీ 17 సినిమా మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆయన సినిమా చేస్తున్నట్లు మాత్రం ప్రచారం జరుగుతోంది. అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే

ప్రత్యేక శ్రద్ధ
వినయ విధేయ రామా లాంటి భారీ డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత చేస్తున్న అన్ని సినిమాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కథ వినడం మొదలు అన్ని విషయాల్లో ఆయన చాలా శ్రద్ధ చూపిస్తూ ఉండటంతో సినిమాలు అంతకంతకూ లేట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన రాజమౌళి చేతిలో పడటంతో ఆ సినిమా బాగా లేట్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

అస్కతికరంగా లైనప్
అయితే ఆచార్య సినిమాలో ముందు రామ్ చరణ్ ని పెద్ద పాత్ర అనుకోలేదు. మహేష్ బాబు కోసం అప్పట్లో ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ కాక పోవడంతో రామ్ చరణ్ ను ఈ సినిమాలో తీసుకున్నారు. ముందు చిన్న పాత్ర అనుకున్నారు కానీ తర్వాత అనూహ్యంగా పాత్ర పరిధి పెరిగిపోయింది. దీంతో దీన్ని కూడా రామ్ చరణ్ 14వ సినిమాగా సంప్రదించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా చిరంజీవి నటిస్తుండగా ఆయన సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక రామ్ చరణ్ పాత్ర కూడా పెద్దది కావడంతో ఆయన కోసం పూజ హెగ్డే ని రంగంలోకి దింపారు..

రామ్ చరణ్ 15వ సినిమా
ఈ సినిమాలు పూర్తయిన తర్వాత రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాగా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ సంగతి పక్కన పెడితే దసరా సందర్భంగా రామ్ చరణ్ 16వ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా రూపొందుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రభాస్ మిత్రులకు చెందిన యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ అలాగే ఠాగూర్ మధుకు చెందిన నిర్మాణ సంస్థ కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రామ్ చరణ్ 16వ సినిమా
ఇక దసరా రోజు సాయంత్రం రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి రామ్ చరణ్, చిరంజీవిలతో ప్రశాంత్ భేటీ అయినట్లు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలతో పాటు ఎక్కడ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇంత ఓపెన్ గా ఫోటోలు పెట్టారు కదా 17వ సినిమా ప్రకటన ఇదే కావచ్చునేమో అని మెగా ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ 17వ సినిమా ప్రశాంత్ నీల్ తోనే చేస్తున్నాడు అన్నట్లుగా ట్రెండ్ సృష్టించారు.

కన్ఫ్యూజన్
అయితే ఈ సినిమా ఇంకా ఫైనల్ కాలేదని రామ్ చరణ్ సన్నిహితులు చెబుతున్నారట. రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్రశాంత్, ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని రామ్ చరణ్ ఉత్సాహంగా ఉన్నారు. దానికి సంబంధించి ఇది మొదటి ఫార్మల్ మీటింగ్ అని అంటున్నారు. ఇది సినిమా గా రూపాంతరం చెందడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని దీనిని రామ్ చరణ్ 17వ సినిమా అని అనుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రశాంత్ ఇప్పటికే కొన్ని కమిట్మెంట్స్ ఉండగా వాటిని పూర్తి చేశాక అప్పుడు ఈ సినిమా గురించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. సో రామ్ చరణ్ 17వ సినిమా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది అన్నమాట.


Click it and Unblock the Notifications











