చంద్రబాబు పై సెటైర్ సినిమా?

ఇక ఈ సినిమా బడ్జెట్టు రెండున్నర కోట్లు వరకూ ఉండవచ్చునని,కాంగ్రేస్ కి పూర్తి స్ధాయి సపోర్టు ఇచ్చే దర్శకుడు ఒకరు దీన్ని తెరకెక్కించటానికి ముందుకొచ్చారని,స్క్రిప్టు ఇప్పటికే రెడీ అయ్యిందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ గా విజయచందర్, బెనర్జీ...చంద్రబాబు గా కనిపించనున్నారని వినిపిస్తోంది. పద్మాలయా స్టూడియోస్ లో దాదాపు ఇరవై రోజుల్లో ఈ చిత్రాన్ని ఫినిష్ చేయాలని డివిడి ల రూపంలో విస్త్రతంగా ప్రచారం చేయాలని,అవకాశం ముంటే ఛానెల్స్ లో పే చేసి మరీ ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరి దీన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు ఏ విధమైన ప్లాన్ చేస్తారో ...లేక ఆయన కూడా ఓ సినిమా తీస్తారో చూడాలి. అలాగే ఇలా ఒకరొకరు పోటీపడి సినిమాలు తీస్తే కాస్త తెలుగుపరిశ్రమ జనాలకు ఈ నాలుగు రోజులైనా పూర్తి స్ధాయి పని దొరుకుతుందని సీనియర్స్ ఆనందపడుతున్నారు.


Click it and Unblock the Notifications











