శ్రీజ పెళ్లి వెనుక ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు!!!
చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి వెనక ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల హస్తముందని తెలుగుదేశం మహిళా నేత నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. విజయవాడలో ఆమె శుక్రవారం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో వారి పేర్లు కూడా చెబుతానంటోంది. ఆమె మాటల్లోనే...ఆ ఎంపీల్లో ఒకరు తెలంగాణా వాసి కాగా ఇద్దరు ఆంధ్ర ప్రాంతంవారు. పెళ్లి కాగానే శ్రీజ దంపతులు ఢీల్లీ కోర్టును ఆశ్రయించేలా ఈ ముగ్గురే చేశారు.. లేదంటే లక్షల రూపాయల ఫీజు తీసుకునే పింకీ ఆనంద్ వారి తరఫున ఎలా వాదిస్తుంది...కట్టుబట్టలతో వెళ్లిన జంట ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్ లో గడిపేందుకు డబ్బేలా వచ్చింది...శ్రీజకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి వారు చిరంజీవిని అల్లరిపాలు చేసి ఆయనకు తీవ్ర క్షోభను మిగిల్చారు...ఆ ఎంపీల పేర్లు ఇపుడే చెప్పబోనని మరిన్ని విషయాలు వెలుగులోకి రాగానే పత్రికలకు విడుదల చేస్తాను..అని ఆమె అంది.


Click it and Unblock the Notifications











