కాంగ్రేస్ లోకి ఎన్టీఆర్?(స్పెషల్)

అందులోనూ ఎన్టీఆర్ మొన్న యువగర్జన కు అటెండుకాకపోవటం వారు ఆసరాగా తీసుకుని రాయబారాలు చేస్తున్నారని సమాచారం. అందుకోసం కేంద్రంలో పలుకబడి ఉన్న నాయకుడు ఒకరుతో ఎన్టీఆర్ కాదనిలేని ఆఫర్ తో ముందుకొస్తున్నారని చెప్పుకుంటున్నారు.అంతేగాక అతని ఫ్యామిలీకి ఇష్టులు,శ్రేయాభిలాషులు ద్వారా చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాయబారాలు,భారీ ఆఫర్లు చూసిన తన నిర్ణయాన్ని త్వరలోనే ఎన్టీఆర్ ఆలోచించి చెపుతానన్నట్లు సమాచారం.
ఇక ఈ ఊహించని పరిణామానికి చంద్రబాబు..వెంటనే స్పందించి బాలయ్యను రంగంలోకి దింపారని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే నిన్న రాత్రి చాలా సేపు బాలయ్య ఇంట్లో చర్చలు జరిగాయనీ వినపడుతోంది. రాబోయేది తెలుగుదేశం కాబట్టి ఆ పార్టీలోనే కొనసాగటం చాలా ఉపకరిస్తుందనీ,తాతగారి ఆశయాలకు అణుగుణంగా పనిచేసినట్లు ఉంటుందని బాలయ్య ఉద్బోదించినట్లు అంటున్నారు. ఇక మరి బంతి ఎన్టీఆర్ కోర్టులో ఉంది. ఈ ఆఫర్ ని అడ్డం పెట్టుకుని ఆయన తెలుగుదేశంలో తనకు కావల్సిన పనులు చక్కపెట్టుకుంటూనే మద్దతిస్తారా లేక చక్కగా కాంగ్రేస్ లో చేరిపోయి..రాజ భోగాలుకు రెడీ అవుతారా అనేది తేలాల్సిందే.


Click it and Unblock the Notifications











