తప్పించుకోవటానికే నాగ్ ఆస్ట్రేలియా?

By Staff

Nagarjuna
నాగార్జున ఆస్ట్రేలియా బయిలుదేరి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఆ టూరుకి పెద్ద ప్రయారిటీ లేదని, కావాలనే కాంగ్రెస్ నుంచి తప్పించుకోవటానికే వెళ్ళాడని అంతటా వినిపిస్తోంది. ఆ మధ్య ప్రకటనల్లో కనపడి సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగార్జునని కాంగ్రెస్ ప్రచారంలోకి దింపటానికి విపరీతమైన ప్రెజర్ ఇస్తున్నారని సమాచారం. ఓ ప్రక్క ఎన్టీఆర్ తన సూటి మాటలతో, ఘాటైన విమర్శలతో కాంగ్రెస్ ని చెండాడుతున్నాడని, దాంతో అతన్ని కొంత వరకూ నయినా ఎదుర్కోగల గ్లామర్ కోసం వెతుకుతున్నారట. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ హ్యాండు ఇచ్చాడని, దాంతో తమ చేతిలో ఉన్న నాగార్జుననే అందుకు వినియోగించుకోవాలని యోచిస్తున్నారుట. ఇక ప్రకటనలకే మీడియా మొత్తం కోడై కోసిందని, అందులోనూ తాను ఎవర్నీ విమర్శించి విరోధిని కాలేనని నాగార్జున స్పష్టం చేసారు. అయినా అన్నపూర్ణ సంస్ధకు గవర్నమెంట్ సపోర్టు ఇచ్చి కొన్ని సమస్యలను తీర్చి, కొన్నింటికి లైసెన్స్ లు ఇచ్చింది. దాంతో ఎట్టిపరిస్ధితుల్లోనూ రోడ్ షోలకు రావల్సిందేనంటున్నారు. ఇక చేసేది లేక హఠాత్తుగా ఆస్ట్రేలియా టూరు పెట్టుకున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X