బిగ్ బాస్ చుట్టూ వివాదాలు, కాచుకుని కూర్చున్న మీడియా.. నాగార్జున ఏం చేయబోతున్నారు?

Recommended Video

Bigg Boss Telugu 3 : Controversies Around Bigg Boss Show || What is Nagarjuna's Next Step?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది అనుకుంటే ఊహించని విధంగా వివాదాల్లో ఇరుక్కుంది. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డితో పాటు నటి గాయిత్రి గుప్తా బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్‌లో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

గత వారం రోజులుగా బిగ్ బాస్ చుట్టూ అలుముకున్న వివాదాలు షో హోస్ట్ నాగార్జునను ఆందోళనలో పడేసినట్లుగా చర్చించుకుంటున్నారు. గతంలో హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్, నానికి ఎదురుకాని భిన్నమైన పరిస్థితులు, వివాదాలు.... నాగార్జునను ఆలోచనలో పడేశాయట.

నాగార్జున ఇలాంటివి ఊహించలేదు

నాగార్జున ఇలాంటివి ఊహించలేదు

బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందు మీడియాతో సమావేశం ఉంటుంది... వివాదాలు ఉన్నాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టకుండా డైరెక్టుగా షో ప్రారంభించినా ఆ తర్వాత ‘మన్మధుడు-2' ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాగార్జున తప్పుకుండా మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. తాను ఊహించని పరిస్థితులు ఎదురవ్వడంతో నాగార్జున కాస్త టెన్షన్ పడుతున్నారట.

మీడియాను ఎలా ఫేస్ చేస్తారో?

మీడియాను ఎలా ఫేస్ చేస్తారో?

స్వయంగా నాగార్జున హోస్ట్ చేయబోయే షో కాబట్టి తప్పకుండా ఈ షోపై ముసురుకున్న వివాదాలపైనే మీడియా వారు ప్రశ్నల వర్షం కురిపించడం ఖాయం. వీటిని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయంలో నాగార్జున మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఇష్టం లేదని చెప్పిన నాగార్జున

గతంలో ఇష్టం లేదని చెప్పిన నాగార్జున

గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ... తనకు బిగ్ బాస్ లాంటి షోలు ఇష్టం ఉండదని, పక్కవారి జీవితం తొంగిచూడటం తనకు నచ్చదు అని అన్నారు. అపుడు అలా చెప్పిన నాగ్ ఇపుడు షోను హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ విషయంపై కూడా నాగార్జున క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇంతకీ షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది

ఇంతకీ షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది

‘బిగ్ బాస్' జులై 21న ప్రారంభం కాబోతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రారంభ తేదీ విషయంలో ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. వచ్చే ఆదివారం ప్రారంభం కావాల్సి ఉన్నా ఇంకా ఈ విషయమై ఎలాంటి ప్రకటనలు రాలేదు.

శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా ఏమని ఫిర్యాదు చేశారంటే...

శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా ఏమని ఫిర్యాదు చేశారంటే...

‘‘బిగ్ బాస్ షోకు చెందిన కొందరు కో ఆర్డినేటర్లు తమను సంప్రదించి... షోలోకి తీసుకుంటున్నట్లు అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టించుకున్నారని, ఆ తర్వాత వారు తమతో వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని, మా బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారు? అంటూ అడుగుతున్నారని, బిగ్ బాస్ షో కోసం అని తాము చాలా అవకాశాలు వదులుకున్నాం, ఇపుడు తమకు అందులో ఛాన్స్ లేదని చెప్పడంతో నష్టపోయాం'' అని శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X