పవన్ కళ్యాణ్ ‘పులి’కి తెలంగాణ దెబ్బ తగిలేనా...?
ఇటీవల అల్లు శిరీష్ తన ట్విట్టర్, యూ ట్యూబ్ లో పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను పోస్ట్ చేసాడు. ఈ ట్రైలర్ లో ఓ పాటలోని రెండు లైన్లు వస్తాయట. ఈ పాటను తన అభిమానులు ఆలపించడం వారి అభిప్రాయలను ట్విట్టర్ లో ఉంచడం జరుగుతోంది. 'మా తెలుగు తల్లికి" అనే పాట పెట్టి ఇది ఆంధ్ర వాళ్ళ సినిమా అని ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత తెలంగాణావాదులు అడ్డుకుంటారు అంటూ విరుచుకుపడుతున్నారట తెలంగాణావాదులు. ఈ పాట ట్విట్టర్ లో పోస్ట్ చేసి అనవసరంగా అల్లు శిరీష్ ఈ సినిమాని కాంట్రవర్సీలో పడేసాడని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
ఫ్రీడమ్ ఫైటర్ అయిన కొమరం భీమ్ కు సంబంధించిన కథతో వస్తున్న సినిమా కాబట్టి తెలంగాణావాదులు ఈ సినిమా పట్ల సుముఖంగానే ఉన్నారు. కానీ తాజా పరిణామాలు మాత్రం ఈ సినిమా విడుదల తర్వాత అడ్డుకుని తీరాలని తెలంగాణావాదులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











