twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వాల్మీకి’ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతల మధ్య విబేధాలు!

    |

    వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'. ఇప్పటికే టైటిల్ వివాదంతో వార్తల్లోకి ఎక్కిన ఈ ప్రాజెక్ట్ విషయంలో తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలకు మధ్య విబేధాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది.

    కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం... ఈ సినిమాకు వచ్చే లాభాల్లో 50 శాతం షేర్ ఇస్తామని దర్శకుడు హరీష్ శంకర్‌తో నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారట. అంత వరకు ఓకే కానీ ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ విషయంలో హరీష్ శంకర్ వేలు పెడుతుండటంపై ప్రొడ్యూసర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Controversy between Valmiki movie director Harish Shankar and producers?

    కొన్ని ఏరియాల్లో 'వాల్మీకి' చిత్రానికి సంబంధించిన బిజినెస్ డీల్స్ హరీష్ శంకర్ క్లోజ్ చేయనీయడం లేదని, ఇంకా ఎక్కువ ధరకు సినిమా అమ్మండి, అనుకున్న రేటు రాకుంటే సొంతగా రిలీజ్ చేయండి అంటూ ఒత్తిడి తెస్తున్నాడట. దీంతో నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారని, ఇస్తానన్న రెమ్యూనరేషన్ తీసుకుని బిజినెస్ వ్యవహారాల్లో వేలు పెట్టడం మానేయాలని సూచించారట.

    ఈ సినిమాకు సంబంధించి ప్రాఫిట్స్‌లో వాటా తీసుకునేందుకు డీల్ కుదిరింది కాబట్టి... తక్కువ రేటుకు బిజినెస్ జరుగుతుంటే ఎలా ఊరుకుంటాం, ఈ సినిమా పెద్ద హిట్టయి మంచి లాభాలు తెస్తుందనే నమ్మకం ఉంది అంటూ వారితో హరీష్ వాదనకు దిగినట్లుగా తెలుస్తోంది.

    ఇలా 'వాల్మీకి' సినిమాకు సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్ బయటకు రావడం చర్చనీయాంశం అయింది. దీన్ని ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకునే అవకాశం ఉందని, ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇలాంటి గొడవలు సర్వసాధారణమే అని అంటున్నారు.

    Controversy between Valmiki movie director Harish Shankar and producers?

    తమిళ కల్ట్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'జిగర్తాండ' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. సిర్థార్థ్ పాత్రలో అథర్వ మురళి కనిపించబోతున్నారు.

    ఈ చిత్రానికి 'వాల్మీకి' టైటిల్ పెట్టడంపై బోయ వాల్మీకి కులానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకి అనేది తమ కులానికి చెందిన దైవం పేరు అని, దాన్ని ఉపయోగించుకోవడమే గాక తుపాకీ వంటి ఆయుధాన్ని పట్టి స్టిల్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

    English summary
    Controversy between Valmiki movie director Harish Shankar and producers. Producers don't like director Harish Shankar's involvement in business deals.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X