బాలయ్యతో రెండు: ఆ హీరోయిన్ విమర్శలు ఎవరిపై?
హైదరాబాద్: హీరోయిన్ రాధిక ఆప్టే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రక్త చరిత్ర సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ తర్వాత బాలయ్యతో 'లెజెండ్', 'లయన్' చిత్రాలు చేసింది. గతంలో తెలుగు సినిమా పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో హాట్ టాపిక్ అయింది.
తెలుగు సినిమా పరిశ్రమలో మేల్ డామినేషన్ ఎక్కువ, హీరోయిన్లకు సరిగా గౌరవం ఇవ్వరూ అంటూ అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ ఓ సెన్సేషన్. ఆ సమయంలో ఆమె బాలయ్యతో నటిస్తోంది కాబట్టి అందరి చూపు అటే వెళ్లింది. దీంతో అపుడు బాలయ్యతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులు కూడా అలాంటిదేమీ లేదు, ఆమెను సరిగానే ట్రీట్ చేసామంట వివరణ ఇచ్చుకున్నారు.

తాజాగా మరోసారి రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఆమె రజనీకాంత్ హీరో తెరకెక్కుతున్న 'కబాలి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.... ఈ సినిమా సమయంలో నన్ను హీరోతో సమానంగా ట్రీట్ చేసారు అన్నారు.
గతంలో కొన్ని సౌత్ సినిమాలు చేసాను. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదుర్కొన్నాను. ఇక్కడ హీరోయిన్లను ట్రీట్ చేస్తున్న తీరు చూసి ఇకపై సౌత్ సినిమాలు చేయకూడదనుకున్నాను. కానీ రజనీకాంత్ సినిమాలో అవకాశం కాబట్టి లైప్ టైమ్ అవకాశంగా భావించి ఒప్పుకున్నాను. తొలిసారి ఒక సౌత్ సినిమాలో నన్ను హీరోతో సమానంగా ట్రీట్ చేసారు అన్నారు రాధిక ఆప్టే.
రాధిక ఆప్టే తాజా కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. గతంలో రాధిక ఆప్టే బాలయ్యతోనే ఎక్కువ సినిమాలు చేసింది. తర్వాత ఇతర సౌత్ సినిమాల్లోనూ నటించింది. మరి ఆమె విమర్శలు ఎవరిపై? అనేది చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











