7 మంది హీరోలతో ప్రేమాయణం, అతనితో పెళ్లి వరకు .. ఆ హీరోయిన్ మళ్లీ లవ్‌లో పడిందా?
చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ, ఎఫైర్స్, బ్రేకప్స్ సర్వసాధారణం. ఎప్పుడు ఏ హీరో లేదా హీరోయిన్ ఎవరిని ప్రేమిస్తారో? ఎవరికి బ్రేకప్ చెబుతారో? కూడా అర్ధం కాదు. బట్టలు మార్చుకున్నంత ఈజీగా పార్ట్‌నర్స్‌ను మార్చేసే నటీనటులు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. పదుల సంఖ్యలో ఎఫైర్స్ నడిపిన వారికి కూడా లెక్కలేదు. హీరో, హీరోయిన్ల ప్రేమాయణాల గురించి నిత్యం గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితం గురించి న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
తొలుత ఐరన్ లెగ్ ముద్ర
భారతదేశం గర్వించదగ్గ మహానటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్. హే రామ్ చిత్రంలో బాలనటిగా నటించిన శృతి.. ఆ తర్వాత లక్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు. తొలినాళ్లలో ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో శృతిహాసన్‌పై ఐరన్ లెగ్ ముద్రపడింది. అయితే 3, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఆ ముద్రను చెరిపేసుకున్నారు శృతిహాసన్. నాటి నుంచి హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు శృతి హాసన్. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆమె నటించారు.

శృతి డైరీ ఫుల్
ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్‌ల కూలీ మూవీలో నటిస్తున్నారు శృతి. దీనితో పాటు ఇళయ దళపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్, పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ సరసన సలార్ 2, విజయ్ సేతుపతితో ట్రైన్ సినిమాలలో నటిస్తున్నారు శృతి. ఇవన్నీ కూడా భారీ బట్జెట్ చిత్రాలు కావడం గమనార్హం. అడివి శేష్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న డెకాయిట్‌లో తొలుత శృతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అడివి శేష్‌తో విభేదాల కారణంగానే శృతి ఈ సినిమా నుంచి వైదొలగినట్లుగా వార్తలు రావడం కలకలం రేపింది. అయితే కూలీ సినిమాలో బిజీగా ఉండటంతో పాటు తనతో ఆమెకు సింక్ కాకపోవడం వల్లనే శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని అడివి శేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
స్టార్ హీరోలతో డేటింగ్
తండ్రి కమల్ హాసన్ మాదిరిగానే రిలేషన్స్, ఎఫైర్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు శృతిహాసన్. కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు పలువురు హీరోలతో ఆమె డేటింగ్ చేసినట్లుగా ఇప్పటికీ చిత్రసీమలో కథలు కథలుగా చెప్పుకుంటారు. వీరిలో సిద్ధార్ధ్, ధనుష్, అక్కినేని నాగచైతన్య, రణబీర్ కపూర్, క్రికెటర్ సురేష్ రైనా, మైఖేల్ కోర్సేల్, శంతను హాజారిక ఉన్నారు. వీరిలో శంతనుతో శృతి పెళ్లి వరకు వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే శృతి, శంతనులు ఒకరి ఇన్‌స్టాగ్రామ్‌ను మరొకరు అన్‌ఫాలో అవ్వడంతో వీరి బ్రేకప్ వార్తలు బయటికి వచ్చాయి. బ్రేకప్‌పై శృతి హాసన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.. అయితే శంతను మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు.
శృతిహాసన్ సంచలన నిర్ణయం
శంతనుతో బ్రేకప్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టారు శృతి హాసన్.. అయితే ఆమె మరోసారి ప్రేమలో పడినట్లుగా చిత్రసీమలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. గతంలోనూ శృతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పారు శృతి హాసన్. ఈ ప్రకటన ఆమె వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలకు కారణమైంది. అకస్మాత్తుగా ప్రైవసీ వైపు వెళ్లడం, సోషల్ మీడియాకు దూరం కావడం వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే డేటింగ్‌కు కొన్నాళ్లు విరామం తీసుకోవాలని అనుకుంటున్నట్లు శృతి గతంలో చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద పబ్లిక్‌కు దూరంగా ఉండాలన్న శృతి హాసన్ నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి ఈ పుకార్లపై ఆమె ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











