Coolie Cast Remunerations: కూలి చిత్రం నటీనటుల పారితోషికాలు.. రజనీ, నాగార్జున, అమీర్ ఖాన్ కు ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలి ఒక్కరోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ నటించడం విశేషం. ఇక వారి పారితోషికాలు ఎంత? టెక్నీషియన్లు ఎంత ఛార్జీ చేశారనే వివరాల్లోకి వెళితే..
కూలి చిత్రం బడ్జెట్ ఎంత?
రజనీకాంత్ కూలి చిత్రంలో భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, స్టార్ నటుడు సత్యరాజ్, మలయాళం స్టార్ సౌబిన్ షహిర్ పవర్ ఫుల్ పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు.

హీరోయిన్ గా స్టార్ నటి శృతి హాసన్ నటించింది. గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి విదితమే. మరోవైపు టాప్ టెక్నీషియన్లు పని చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం విశేషం. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలుపుకొని 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.
రజనీతో పాటు స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్లు..
కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించినందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఏకంగా రూ.200 కోట్లు పారితోషికం తీసుకున్నారంట. విలన్ పాత్రలో నటించిన అక్కినేని నాగార్జున రూ.10 కోట్లు, హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ రూ.4 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. అలాగే, కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా రూ.4 కోట్ల రెమ్యునరేషన్, బాహుబలి కట్టప్ప స్టార్ నటుడు సత్యరాజ్ రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు.
ఇక 20 నిమిషాల పాటు కనిపించబోయే అమీర్ ఖాన్ రూ.20 కోట్లు ఛార్జీ చేశారని తెలుస్తోంది. ఇక స్పెషల్ సాంగ్ లో నటించినందుకు స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే రూ.3 కోట్లు పారితోషికం అందుకుందంట. కూలి చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ రూ.50 కోట్లు ఛార్జీ చేశారని సినీ ప్రముఖులు తెలుపుతున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రటకన లేదు.
ఇక సంగీత దర్శకత్వం వహించిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రూ.15 కోట్లు అందుకున్నారు. ఇలా పారితోషికాలకే మేకర్స్ 300 కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ 550 కోట్ల రూపాయలు అయ్యిందని, ప్రీ రిలీజ్ లెక్కల తర్వాత పారితోషికాలను ఇలా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల వసూళ్లును టార్గెట్ గా పెట్టుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











