ఆమె అంత కోపరేటివా?
అవును..ఆమెతో చాలా హ్యాపీ..చాలా కోపరేటివ్ గా ఉంటుంది అంటున్నారు సదా గురించి అంతా. మడి కట్టుకు కూర్చోవటం కన్నా కాస్త సోషల్ గా మెలిగితే ఆఫర్స్ కి అంతే ఉండదని లేటెస్ట్ గా ఆమె తెలుసుకుందని అంతా అంటున్నారు. అది ఈ మధ్యనే అఆఇఈ షూటింగ్ సమయంలో రుజువయిందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సదా తెరపై అందచందాలు చూపటమే కాక తెరవెనుక కూడా అందరితో చాలా..చాలా స్నేహ పూర్వకంగా మెలిగిందని అంటున్నారు.
అలాగే పాటలు నిమిత్తం దుబాయి కి వెళ్ళినప్పుడు నిర్మాత, దర్శకులు ఆమె షాపింగ్ కి సైతం ఖర్చుపెట్టారంటే ఆమె వారని ఏ విధంగా ఆకట్టుకుందో ఆలోచించుకోవచ్చు అంటున్నారు. నిజానికి అపరిచితుడు అనంతరం సదా కి విచిత్రంగా ఆపర్స్ తగ్గిపోయాయి. అప్పటికి కన్నడ, తమిళ, మళయాళ అంటూ అన్ని భాషల్లో ప్రయత్నించింది. కానీ ఎక్కడా ఏమీ వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాక మరిన్ని అవకాశాలకు రాచబాట వేసుకోవాలని ఆమె భావించిందని అంటున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ సదా


Click it and Unblock the Notifications