twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నేసింది సురేందర్ రెడ్డి.. కబ్జా చేసింది త్రివిక్రమ్.. మధ్యలో సుకుమార్?: వాటీజ్ దిస్?

    |

    Recommended Video

    ఒకే కధ పై ముగ్గురు దర్శకులా ?

    విషయం పాతదే.. ఈ వివాదాలు పాతవే.. కొన్నాళ్ల హడావుడి తర్వాత మళ్లీ దాని ఊసే ఎక్కడా కనిపించదు. కాపీ కథ అని విమర్శకులు ఆరోపిస్తారు.. పోయిందేముందిలే హిట్ కొట్టామా? లేదా? అన్నదే మా పాయింట్ అన్నట్లు దర్శకులు వ్యవహరిస్తారు.

    కాబట్టి కాపీ సీన్ ఇప్పుడు అజ్ఞాతవాసికి మారిందంతే. కానీ అసలు విషయమేంటంటే.. కథల విషయంలో ఇలా ఎత్తిపోతల పథకాల్ని(ఎత్తుకొచ్చేయడం) అమలు చేయాల్సిన దుస్థితిలో మన దర్శకులు ఎందుకున్నారు?..

    త్రివిక్రమ్‌పై కాపీ విమర్శలు:

    త్రివిక్రమ్‌పై కాపీ విమర్శలు:

    కత్తి మహేష్ అన్నాడనో.. ఇంకోటనో కాదు కానీ నిజంగానే త్రివిక్రమ్ హాలీవుడ్ సినిమాల నుంచి కథలను ఎత్తుకొస్తాడనే విమర్శలు ఇండస్ట్రీలోనే వినిపిస్తుంటాయి.

    త్రివిక్రమ్ కెరీర్ తొలినాళ్లలో రచయితగా వ్యవహరించిన 'చిరునవ్వు'తో సినిమాలో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే ఫ్రెంచ్ సినిమా ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించాయన్న విమర్శలు వినిపించాయి.

    నవలలు కూడా!..:

    నవలలు కూడా!..:

    అంతెందుకు.. తెలుగులో వచ్చిన మధుబాబు, యుద్దనపూడి లాంటి ప్రసిద్ద రచయితల నవలల నుంచి కొన్ని సీన్లు తీసుకొచ్చి ఆయన సినిమాల్లో దించేశారు. నవలలను బేస్ చేసుకుని అందులోని సీన్స్ సినిమాలో పెట్టడంలో తప్పు లేకపోవచ్చు.

    కానీ ఆ రాసినవాళ్లకు ఆ క్రెడిట్ ఇవ్వకపోతేనే అసలు తంటా. నితిన్ తో తెరకెక్కించిన 'అ..ఆ' సినిమా యుద్దనపూడి రాసిన ఓ నవల అనేది సినిమా చూశాక అందరికీ అర్థమైంది. ఇదే విషయంపై అందరూ మాట్లాడటంతో.. అప్పుడు గానీ త్రివిక్రమ్ ఆ రచయితకు స్క్రీన్ పై క్రెడిట్ ఇవ్వలేదు.

     ఇప్పుడు 'అజ్ఞాతవాసి':

    ఇప్పుడు 'అజ్ఞాతవాసి':

    త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం అజ్ఞాతవాసి కూడా ఇప్పుడు కాపీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. జెరోం సల్లే అనే ఫ్రెంచ్ డైరెక్టర్ తెరకెక్కించిన 'లార్గో వించ్' కథనే త్రివిక్రమ్ కాపీ కొట్టాడన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ కన్నా ముందే వేరే దర్శకులు కూడా కాపీ కొట్టాలని ప్రయత్నించినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

    సురేందర్ రెడ్డి కన్ను కూడా పడిందట:

    సురేందర్ రెడ్డి కన్ను కూడా పడిందట:

    లార్గో వించ్ సినిమా మీద త్రివిక్రమ్ కన్నా ముందే దర్శకుడు సురేందర్ రెడ్డి కన్ను పడిందట. పడటమే కాదు.. అదే కథతో అల్లు అర్జున్ కు కథ కూడా వినిపించాడట. ఇంతలోనే డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాలోని లైన్ తోనే 'నాన్నకు ప్రేమతో' తెరకెక్కిస్తారని తెలుసుకుని డ్రాప్ అయిపోయారట.

     కానీ అప్పటికే సుకుమార్..:

    కానీ అప్పటికే సుకుమార్..:

    అయితే నాన్నకు ప్రేమతో రిలీజ్ అయ్యాక.. లార్గో వించ్ నుంచి కొన్ని సీన్స్ మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నారని తేలింది. తండ్రి కోసం పగ తీర్చుకోవడం అన్న ఒక్క లైన్ తప్పితే మిగతాది అంతా సుకుమార్ అల్లుకుపోయారు. ఈ విషయం ముందే తెలిసి ఉంటే.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇదే సినిమా స్ఫూర్తితో బన్నీతో సినిమా కమిట్ అయ్యేవాడేమో!:

     ఫైనల్‌గా త్రివిక్రమ్..

    ఫైనల్‌గా త్రివిక్రమ్..

    'లార్గో వించ్'పై కన్నేసిన సురేందర్ రెడ్డి మొత్తానికి దాని నుంచి డ్రాప్ అయ్యాడు. అలాగే దర్శకుడు సుకుమార్ దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. కాబట్టి త్రివిక్రమ్ ఇప్పుడు 'లార్గో వించ్' స్ఫూర్తితో 'అజ్ఞాతవాసి' తీశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఈ విమర్శలను కూడా త్రివిక్రమ్ ఖండించకపోతుండటంతో వాటికి మరింత బలం చేకూరుతోంది.

     సొంతంగా రాయలేరా..:

    సొంతంగా రాయలేరా..:

    దర్శకులపై కాపీ విమర్శలు రావడం కొత్తేమి కాకపోయినప్పటికీ.. సొంతంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎంత కాపీ అయితే మాత్రం ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా కథను మలచడంలో వారి టాలెంట్ దాగుందని, దానివల్లే సినిమాలు హిట్ అవుతున్నాయని వాదించేవారూ లేకపోలేదు. మొత్తానికి ఇలా సమర్థించేవాళ్లు.. విమర్శించేవాళ్ల మధ్య ఇలాంటి కాపీ వివాదాలపై వాదనలు నడుస్తూనే ఉంటాయి తప్ప.. ఇది ఒక పట్టాన తేలే సంగతి ఎంతమాత్రం కాదు.

    English summary
    Director Trivikram Srinivas facing copy allegations on Agnyaathavasi movie. T-Series company has already bought the Indian remake rights of that French movie. There is a talk that T-series has already sent the legal notice for the makers of Agnathavasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X