twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి కాపీ క్యాట్' చిక్కుల్లో థమన్.. V వల్ల ఆడుకుంటున్నారుగా..

    |

    ఒకప్పుడు అంటే సోషల్ మీడియా టెక్నాలజీ ప్రభావం చాలా తక్కువ కాబట్టి క్రియేటివిటీ విషయంలో పెద్దగా ఆరోపణలు వచ్చేవి కావు. ఒక విషయాన్ని ప్రేరణగా తీసుకొని సినిమా కోసం వాడితే బావుంటుంది గాని ఉన్నదన్నే యధావిధిగా వాడేస్తే కాపీ క్యాట్ అనే మరక అంటకుండా ఉండదు. ఈ రోజుల్లో ఆడియెన్స్ ని మెప్పించడం చాలా కష్టమైన పని. ఇక లోపాలు దొరికితే ఓ వర్గం వారు సెటైర్స్ వేయకుండా ఉండలేరు. ఇక ఇటీవల థమన్ కెరీర్ లో మరోసారి కాపీ క్యాట్ ఆరోపణల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

    ఎంత ఆకట్టుకున్నా కూడా..

    ఎంత ఆకట్టుకున్నా కూడా..

    సంగీత దర్శకుడిగా థమన్ అందిస్తున్న కొత్త తరహా మ్యూజిక్ ప్రతిసారీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అల.. వైకుంఠపురములో అందించిన సాంగ్స్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే థమన్ ఎంత ఆకట్టుకుంటున్నా కూడా ప్రతీసారి ఎదో ఒక నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు.

    థమన్ పై ట్రోలింగ్

    థమన్ పై ట్రోలింగ్

    రీసెంట్ గా థమన్ V సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై తీవ్ర స్థాయిలో క్యాపి క్యాట్ ఆరోపణలు వస్తున్నాయి. తమిళ్ సినిమా రాట్ససన్ సినిమాలో బాగా క్లిక్కయిన సైకో కిల్లర్ థీమ్ మ్యూజిక్ ని V సినిమాలో నాని కోసం గట్టిగానే వాడారు. సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన కొన్నిగంటలకే మిక్సీడ్ టాక్ మొదలైంది. ఎక్కువగా థమన్ పై ట్రోలింగ్స్ వస్తున్నాయి.

    గతంలో కూడా కాపీ ఆరోపణలు

    గతంలో కూడా కాపీ ఆరోపణలు

    గతంలో కొన్నిసార్లు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు థమన్ దర్శక నిర్మాతల సలహా మేరకు కొన్ని సాంగ్స్ ని యధావిధిగా కాపీ కొట్టడం జరిగిందని చెప్పాడు. ఒక విధంగా అప్పుడు వచ్చిన విమర్శకులకు థమన్ చాలా సీరియస్ అయ్యాడు కూడా. ఇక ఇప్పుడు V సినిమా ద్వారా మళ్ళీ కాపీ ఆరోపణలు రావడం చూస్తే థమన్ దర్శకనిర్మాతల సలహా మేరకు అలా చేశాడా? అనే అనుమానం వస్తోంది. మరి థమన్ ఈ కామెంట్స్ పై ఏ విధంగా వివరణ ఇస్తారో చూడాలి.

    Recommended Video

    Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
    థమన్ చేయాల్సింది కాదు..

    థమన్ చేయాల్సింది కాదు..

    అసలైతే V సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ ఇవ్వాల్సింది కాదు. సినిమాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది ద్వారానే BGM ఇప్పించాలని అనుకున్నారు. కానీ ఎందుకో మళ్ళీ ఆ విషయంలో దిల్ రాజు మార్పులు చేసి థమన్ ని సెట్ చేసుకోవడం అప్పట్లో బాగానే వైరల్ అయ్యింది. ఏదేమైనా అల.. వైకుంఠపురములో లాంటి బాక్సాఫీస్ హిట్టు అనంతరం థమన్ ఈ విధమైన కామెంట్స్ ఎదుర్కోవడంతో కొంత ఆయన అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తోంది. మరి థమన్ ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో చూడాలి.

    English summary
    With the domination of the OTT sector increasing, the situation of movie theaters is becoming scary. Many already realize that the number of theaters in the future could be drastically reduced. The explanation that OTTs are running is also debatable. So before that Allu Aravind Aha app took over.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X