'వకీల్ సాబ్'పై కరోనా ఎఫెక్ట్.. డైలామాలో పవన్ కళ్యాణ్ మూవీ!

దేశవిదేశాల్లో కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీర తాండవం చేస్తోంది. కరోనా దెబ్బకు సినీ, పారిశ్రామిక రంగాలు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్'పై కూడా కరోనా ఎఫెక్ట్ పెడుతోందట. వివరాల్లోకి పోతే..

అందరి కోరిక మేరకు పవన్ స్టెప్.. రీ ఎంట్రీ

అందరి కోరిక మేరకు పవన్ స్టెప్.. రీ ఎంట్రీ

తన కెరీర్ లో 25 సినిమాలు పూర్తిచేసిన పవన్ కళ్యాణ్.. అజ్ఞాతవాసి తర్వాత రాజకీయ బాట పట్టారు. కానీ ప్రేక్షకులు, దర్శకనిర్మాతల కోరిక మేరకు రెండేళ్ల తర్వాత రీసెంట్‌గా తిరిగి కెమెరా ముందుకొచ్చారు. తన 26వ సినిమాగా 'వకీల్ సాబ్' చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చారు. గత కొన్నిరోజులుగా శరవేగంగా సాగిన షూటింగ్ కరోనా దెబ్బకు వాయిదా పడింది.

 దిల్ రాజు నిర్మాణ సారథ్యం.. మేజర్ పార్ట్ ఫినిష్

దిల్ రాజు నిర్మాణ సారథ్యం.. మేజర్ పార్ట్ ఫినిష్

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' సినిమాకు రీమేక్‌గా 'వకీల్ సాబ్' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది.

వేసవి రిలీజ్.. అనుకోని సందిగ్దత

వేసవి రిలీజ్.. అనుకోని సందిగ్దత

జెట్ స్పీడులో షూటింగ్ చేస్తున్న యూనిట్ మే 15న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఆ డేట్ విషయంలో డైలమా ఏర్పడింది. కరోనా కారణంగా ప్రస్తుతం ఎలాంటి షూటింగ్ కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో 'వకీల్ సాబ్' షూటింగ్‌లో మిగిలిన కొంతభాగం ఎప్పుడు షూట్ చేస్తారా? అనే విషయంలో సందిగ్దత ఏర్పడింది.

 'వకీల్ సాబ్'పై అందరిలో అనుమానాలు..

'వకీల్ సాబ్'పై అందరిలో అనుమానాలు..

'వకీల్ సాబ్'కి సంబంధించి మరో పది రోజులపాటు పవన్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉందట. అలాగే, పవన్ కళ్యాణ్‌ అతనికి భార్యగా నటించే హీరోయిన్‌పై కూడా ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయాలట. నివేదా థామస్‌తో పాటు ఇతర నటులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇంకొంత ఉందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్. చూస్తే టైమ్ తక్కువగా ఉంది. దీంతో 'వకీల్ సాబ్'పై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

Recommended Video

Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
ముగ్గురు హీరోయిన్స్.. పవన్ రొమాన్స్

ముగ్గురు హీరోయిన్స్.. పవన్ రొమాన్స్

'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు అందాల భామలు నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో నివేదా థామస్ రోల్ సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఆమె పాత్ర ఉండనుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X