కరోనా ఎఫెక్ట్ : నిర్మాతల షాకింగ్ డెసీషన్.. నేరుగా అందులోనే విడుదల!
కరోనా ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టలేకపోవడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా మూతపడిపోయింది.

స్వచ్చందంగా బంద్..
కరోనా విజృంభిస్తున్న తరుణంలో టాలీవుడ్ మొత్తం షూటింగ్స్ రద్దని, అందరూ ఇంటికి పరిమితమవుతారని సినీ పెద్దలు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. లాక్ డౌన్ విధించడానికి ముందుగానే టాలీవుడ్ మొత్తం స్వచ్చందంగా ముందుకు వచ్చింది.

సినిమాలు వాయిదా..
కరోనాను కట్టడి చేసేందుకు జనాలు గుమిగూడే ప్రాంతాలను మూసి వేసినట్టు ప్రభుత్వాలు ప్రకటించడంతో థియేటర్లు క్లోజ్ అయ్యాయి. ఈ దెబ్బకు విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ నెలలోనైనా పరిస్థితులు చక్కబడతాయన్న ఆశ కనబడటం లేదు.

నిర్మాతల నిర్ణయం..
ఇప్పట్లో పరిస్థితి చక్కబడేట్టు కనిపించడం లేదని భావించిన టాలీవుడ్ నిర్మాతలు ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమ సినిమాలు వాయిదా పడటం, ఎప్పుడు విడుదలవుతాయో తెలియకపోవడంతో వారంతా కలిసి త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.
Recommended Video

ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లో..
ప్రజలంతా ఇంటి పట్టునే ఉండటంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. అందువల్ల తమ సినిమాలను నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లపైనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ నిర్ణయం వారికి లాభం చేకూరుస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











