ప్రభాస్ సినిమా కోసం నెవర్ బిఫోర్ సెట్.. రూ.30కోట్లతో..

రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏమిటో మరోసారి రాధేశ్యామ్ షూటింగ్ తో క్లియర్ గా అర్ధమయ్యింది. అలస్యమయినా కూడా ఈ సారి అభిమానుల అంచనాలకు తగ్గకుండా సినిమాను తేవాలని ప్రభాస్ టీమ్ బాగానే కష్టపడుతోంది. ఖర్చు విషయంలో అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ అయ్యింది. ఎదో వంద కోట్లతో ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా ఎండ్ అయ్యేవరకు లెక్క 200కోట్లు దాటేలా ఉంది.

పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు కావున అన్ని భాషల వారికి నచ్చేలా ఉండాలని దర్శక నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇటలీకి వెళ్లి ఇటీవల ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ బృందం త్వరలోనే హైదరాబాద్ లోనే మరో భారీ షెడ్యూల్ కి ప్లాన్ రెడీ చేసుకుంది. దాదాపు 30కోట్ల రూపాయలతో ఒక స్పెషల్ సెట్ ని రెడీ చేయనున్నారట.

Costly set for prabhas upcoming movie radhe shyam

అందులోనే సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆ సీన్స్ చాలా కీలకమని టాక్ వస్తోంది. అందుకే మొదట 20కోట్లతో పూర్తి చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు 30కోట్లకు ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. మరి ఆ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X