»   » ఐస్ క్రీమ్ : రామ్ గోపాల్ వర్మకు సిటీ పోలీస్ కమీషనర్ షాక్?

ఐస్ క్రీమ్ : రామ్ గోపాల్ వర్మకు సిటీ పోలీస్ కమీషనర్ షాక్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఐస్ క్రీమ్' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర బాగోలేదంటూ కొందరు సినీ విమర్శకులు తేల్చేసారు. కొందరైతే జీరో రేటింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసంతృప్తికి గురైన వర్మ హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా అపాయింట్ మెంట్ కోసం తన అనుచరుణ్ణి పంపించిన వర్మకు చేదు అనుభవం ఎదురైనట్లు మీడియా టాక్. తర్వాత నేరుగా వర్మనే మహేందర్ రెడ్డికి కాల్ చేసి కలవాలని కోరగా సీపీ సున్నితంగా తిరస్కరించారని టీవీ ఛానల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పడంతో...ఖంగుతిన్న వర్మ ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా వెనక్కి వెళ్లిపోయినట్లు మీడియా టాక్.

CP rejects appoint for Ram Gopal Varma

ప్రతి విషయాన్ని పబ్లిసిటీగా మార్చుకునే వర్మ.....ఐస్ క్రీమ్ సినిమా విషయంలో పోలీస్ కమీషనర్‌ను కలిసి హడావుడి చేయాలని ప్రయత్నించారని, వర్మ గిమ్మిక్స్ ముందే పసిగట్టిన పోలీసులు అతనికి ఆ అవకాశం ఇవ్వలేదని, అందుకే కమీషనర్ వర్మకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని టీవీ ఛానల్స్‌లో వార్తలు వెలువడ్డాయి.

పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం...తాను కార్యాలయంలో లేని సమయంలో ఎవరైనా ఫోన్ చేసి ఉండొచ్చని, వర్మ చేసారా? లేదా? అన్నది ఆ సమయంలో సిబ్బంది గుర్తించి ఉండకపోవచ్చని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

ఐస్ క్రీమ్ సినిమా విషయానికొస్తే....'ఐస్ క్రీమ్' చిత్రంలో తేజస్వి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని భీమవరం టాకీస్ బేనర్లో తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.

English summary
Media source said that, Hyderabad CP Mahender Reddy rejects appoint for Ram Gopal Varma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu