‘తీన్ మార్’కు స్పెషల్ క్రేజ్ ‘ఏయ్ చికితా కుమస్తాస్..'!
పవన్ కళ్యాణ్ ప్రతి మూవీలోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూనే వుంటాడు. హిందీ డైలాగులు, ఇంగ్లీషు పాటలతో ఆల్రెడీ తెలుగు సినిమాకు ఓ కొత్త సోకును తీసుకొచ్చిన పవర్ స్టార్, ఈసారి 'తీన్ మార్"తో ఇంటర్నేషనల్ రేంజుకు ఎదిగిపోయాడు. స్పానిష్ భాషలో 'ఏయ్ చికితా కుమస్తాస్.."అంటూ పవన్ పలుకుతున్న డైలాగులతో 'తీన్ మార్"టీజర్లు అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి.
బద్రీ సినిమాలో బద్రీ, బద్రీనాథ్, ఖుషి సినిమాలలో సిద్ధు, సిధ్దార్థరాయ్ అంటూ కొత్త పేర్లను పరిచయంచేస్తే తీన్ మార్ కోసం ఇప్పటికే మైకేల్ వేలాయుధం, అర్జున్ పాల్వాయ్ అంటూ కొత్త పేర్లు ను పరిచయం చేసి 'తీన్ మార్"కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దున్నేయడం ఖాయమని ఫ్యాన్సు అప్పుడే ఆనందంలో మునిగిపోతున్నారు. ఇన్ని అంచనాలను నెట్టుకొని పవర్ స్టార్ ఎలా దూసుకెళతాడో వేచి చూడాలి అంటే ఏప్రిల్ 14న విడుదల వరకూ ఆగాల్సిందే మరి..


Click it and Unblock the Notifications











