మెగాస్టార్ కోసం క్యూ కడుతున్న క్రేజీ డైరెక్టర్స్.. సైరా తరువాత కూడా దుమ్ము దులిపే సినిమాలే!
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150తో సినిమాల్లోకి ఘనమైన పునరాగమనం చేసారు. ఖైదీ చిత్రం ఘనవిజయం సాధించింది. అదే జోరుతో మెగాస్టార్ ప్రస్తుతం సైరా చిత్రంలో నటిస్తున్నారు. సైరా చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మెగాస్టార్ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

క్రేజీ దర్శకులు క్యూలో
రాజకీయాలకు దూరం జరిగాక చిరంజీవి పూర్తి సినిమాలపైనే దృష్టి పెట్టారు. చాలా ఏళ్ల గ్యాప్ తరువాత చేసిన ఖైదీ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సైరా సెట్స్‌పై ఉండగానే
దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందిస్తున సైరా చిత్రం సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ తో సినిమా చేయడానికి క్రేజీ దర్శకులంతా ఇప్పటి నుంచే క్యూలో నిలుచుంటున్నారు. మెగాస్టార్ తదుపరి చిత్రాలపై ఇప్పటినుంచే ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

అశ్వినీదత్ ప్రకటన
మంచి కథ సిద్దమైనతే త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాం అని ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. మహానటి చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో చిరు చిత్ర యూనిట్ ని అభినందించారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ ఈ ప్రకటన చేశారు.
Recommended Video


కొరటాల శివ ప్రయత్నాలు
మిర్చి చిత్రం నుంచి భరత్ అనే నేను చిత్రం వరకు తాను తెరకెక్కించిన అన్ని చిత్రాల విజయాలతో కొరటాల శివ తిరుగులేని దర్శకుడిగా నిలిచారు. కొరటాల తో సినిమా చేయడానికి స్టార్ హీరోలంతా అత్యంత ఆసక్తిగా ఉన్నారు. కానీ కొరటాల చూపు మెగాస్టార్ పై పడ్డట్లు తెలుస్తోంది. చిరుతో సినిమా చేయడానికి కొరటాల ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది.

బోయపాటితో
బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి చిరంజీవి ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన రావడం లేదు.


Click it and Unblock the Notifications











