నెక్స్ట్ సినిమాకు అదిరిపోయే టైటిల్ సెట్ చేసుకున్న రవితేజ!

మాస్ మహారాజా రవితేజ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. రాజా ది గ్రేట్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటున్న తరుణంలో ఊహించని విదంగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో అభిమానులకు షాకిచ్చాడు. ముఖ్యంగా డిస్కో రాజా సినిమాతో చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు.

విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేయడంతో ఈ సారి మాస్ రాజా హిట్టు కొట్టడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ ఈ హీరో అదే తరహాలో డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ఫైనల్ గా నెక్స్ట్ సినిమాలతో అయినా సక్సెస్ అందుకోవాలని మాస్ రాజా డిఫరెంట్ కాన్సెప్టులతో సిద్ధమవుతున్నాడు.

Crazy title for ravi teja upcoming movie with ramesh varma

ముందుగా టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు క్రాక్ అనే టైటిల్ సెట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా అదే తరహాలో మరొక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. మాస్ రాజా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక లాక్ డౌన్ అనంతరం తన కొత్త సినిమాను స్టార్ట్ చేయడానికి మాస్ రాజా న్యూ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X