»   » క్రి్కెటర్‌తో తమన్నా పెళ్ళి! .. హాట్ టాపిక్‌గా మిల్కీ బ్యూటీ మ్యారేజ్..

క్రి్కెటర్‌తో తమన్నా పెళ్ళి! .. హాట్ టాపిక్‌గా మిల్కీ బ్యూటీ మ్యారేజ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్‌తోపాటు బాలీవుడ్‌లో రాణిస్తున్న తమన్నా భాటియా వివాదాలకు బహుదూరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లదు. కానీ తాజాగా ఆమె పెళ్ళి వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్ సంచలనం రేపుతున్నది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాలంటే.. ఈ వార్తపై తమన్నా స్పందించాల్సిందే, అబ్దుల్ రజాక్‌ పాక్ తరపున పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ వార్తకు సంబంధించిన వివరాలు ఇవే..

 సోషల్ మీడియాలో వైరల్‌గా ..

సోషల్ మీడియాలో వైరల్‌గా ..

పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ని మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్ళాడబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి రూమర్ ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిందని అందరు ఆరా తీస్తున్నారు. త‌మ‌న్నా, అబ్ధుల్ రజాక్ ఇద్దరు కలిసి నగల‌ దుకాణంలో కలిసి ఉన్న ఫోటో నెటిజన్ల కంట పడటటం వార్తకు బలం చేకూరింది. దాంతొ తన ప్రియుడితో కలిసి పెళ్ళి షాపింగ్ చేస్తుందని జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఫోటో వెనుక ఉన్న కథ ఏమిటంటే..

ఫోటో వెనుక ఉన్న కథ ఏమిటంటే..

అసలు ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఏమిటంటే ఈ పిక్ 2013 నాటిది., అప్పట్లో దుబాయ్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కి తమన్నా, రజాక్ వెళ్ళారు. ఆ ఫోటో అప్పుడు క్లిక్ చేసిందే . ఇప్పుడు ఈ పిక్ ని వైరల్ గా మార్చి తమన్నా పెళ్లి పీటలెక్కనుందని రూమర్స్ పుట్టించారు.

పెళ్లి వార్త కొద్ది రోజులుగా

పెళ్లి వార్త కొద్ది రోజులుగా

బాహుబలిలో అవంతికగా నటించి జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా పెళ్లి వార్త కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారడంతో ఇటు సౌత్ , అటు బాలీవుడ్ అభిమానులు షాక్ అయ్యారు. అసలు విషయం తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు,

గతంలో ఓ ఇంజనీర్‌ని ..

గతంలో ఓ ఇంజనీర్‌ని ..

తమన్నా గతంలో ఓ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోబోతుందని రూమర్లు రాగా వాటిని తమన్నా ఖండించింది., నా జీవితంలోకి ఎవరైన అడుగు పెడితే నేనే మొదట మీ అందరికి చెబుతాను అని మిల్కీ బ్యూటీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సినిమాల విషయానికి వస్తే తమన్నా పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ సరసన జై లవకుశ లో ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం.

English summary
Social media is buzzing with the story of an affair between former Pakistani cricketer Abdul Razzaq and Bahubali fame actress Tamanna Bhatia. Actually, all credit goes to the picture which has become a center of attraction for users of Facebook and Twitter. In the viral photo, both Razzaq and Tamanna are seen buying jewelry in a shop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu