ఎన్టీఆర్ కు విలన్ ఇతనే

By Srikanya

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ సినిమాల్లో విలన్స్ కు ప్రత్యేకంగా ఉంటారు. చిత్రమైన మేనరింజస్ తో స్టైలిష్ గా వారు హీరోలకు పోటీ ఇస్తూ ఆదరకొడ్తూ అకట్టుకుంటూంటారు. అందుకే పూరి తన చిత్రంలో విలన్స్ గా ఎప్పటికప్పుడు కొత్తవారిని వెతుకుతూంటారు. తాజాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేదానికి గురై క్రికెట్ కు దూరమైన కేరళ క్రికెటర్ శ్రీశాంత్ కి తన తాజా చిత్రం నేనో రకం లో ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

శ్రీశాంత్ ఇప్పటికే ఓ మళయాల చిత్రంలో గెస్ట్ రోల్ చేసాడు. పలు సందర్భాల్లో తెలుగు సినిమాల్లో పని చేయాలని ఉందంటూ వ్యాఖ్యలు చేసాడు. క్రికెట్ ద్వారా తపై పడ్డ మాయని మచ్చను......ఈ సినిమా రంగంలో ప్రవేశించడం ద్వారా తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తున్న శ్రీశాంత్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి అంటున్నారు.

Cricketer to Play Baddie Role in NTR film!

ఇక నేనో రకం చిత్రం విషయానికి వస్తే.... ఎన్.టి.ఆర్ , పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా సెట్స్ పైన ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వక్కంతం వంశీ ఈ సినిమా కోసం చాలా కొత్త కథని అందిస్తే, దానికి పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించారు.

నిర్మాత బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరవేరుది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు' అన్నారు.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X