బాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బ్రేకప్.. సచిన్ కూతురుతో డేటింగ్ కారణమా?
బాలీవుడ్ తారలు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణాలు, డేటింగ్స్, బ్రేకప్స్ పెద్ద కొత్తేం కాదు. ఎప్పుడూ ఎవరో ఒక క్రికెటర్-హీరోయిన్ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న క్రికెటర్ పేరు శుభ్‌మన్ గిల్. టీమిండియా యువ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులోను గిల్ ముందున్నాడు. అయితే గిల్ పేరు వినగానే ముందుగా గుర్తు వచ్చేది ఆయన ఆట ఆడే తీరుతోపాటు లవ్ ఎఫైర్స్. తాజాగా ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్, గిల్ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరో కుమార్తెగా: స్టార్ హీరో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది సారా అలీ ఖాన్. పేరుకు సైఫ్ అలీ ఖాన్ కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా అభిమానులను సంపాదించుకుంది.

ఉత్తమ నటి: 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన 'కేదార్‌నాథ్' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం కావడంతో బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డును అందుకుంది. ఈ మూవీ తర్వాత 'సింబా'లో నటించి మెప్పించింది హాట్ బ్యూటి సారా అలీ ఖాన్.

త్వరలో అలా: అనంతరం సారా అలీ ఖాన్ 'లవ్ ఆజ్ కల్', 'కూలీ నెంబర్ 1', 'అత్రంగీ రే' 'గ్యాస్ లైటర్' వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. వీటిలో నటనకు నటన, అందానికి అందంతో మంచి పేరును సంపాదించుకుంది. త్వరలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో నటించిన 'జరా హట్కే జరా బచ్కే' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

రొమాంటిక్ డిన్నర్: అలాగే 'అయి వాటన్ మేరే వాటన్', 'లూకా చూపీ 2' సినిమాలతోపాటు జగన్ శక్తి తెరకెక్కించే సినిమాలో నటిస్తోంది సారా అలీ ఖాన్. అయితే ఇటీవల క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తో సారా లవ్ ట్రాక్ నడుపుతుందని వార్తలు తెగ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జంట దుబాయ్ లో రొమాంటిక్ డిన్నర్ చేస్తూ మీడియా కంటపడ్డారు. అలాగే విమానంలో కలిసి ప్రయాణించడంతో వీళ్లు డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.

బ్రేకప్ చెప్పుకుని: అయితే సారా అలీ ఖాన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వీళ్లిద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని, ఇదే వాళ్లు బ్రేకప్ చెప్పుకున్నారనేదానికి సంకేతం అని అంటున్నారు. అయితే సారాకు శుభ్‌మన్ గిల్ బ్రేకప్ చెప్పడానికి కారణం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమార్తే సారా టెండుల్కర్ తో డేటింగ్ అని ఇన్ సైడ్ టాక్.

సారాతో డేటింగ్: నిజానికి శుభ్‌మన్ గిల్ మొదట సారా టెండుల్కర్ తో ప్రేమలో ఉన్నాడట. తర్వాత సారా అలీ ఖాన్ కోసం ఆమెను వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సారా టెండుల్కర్ కోసం సారా అలీ ఖాన్ ను శుభ్‌మన్ గిల్ వదిలేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సారాను తన బాయ్ ఫ్రెండ్ శుభ్‌మన్ గిల్ దారుణంగా చీట్ చేశాడని ఇటీవలే ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీటులో పేర్కొన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











