»   » అరవింద సమేత రష్ చూశాం.. మైండ్ బ్లోయింగ్.. టెర్రిఫిక్.. మరో బ్లాక్‌బస్టర్.. క్రిటిక్ వెల్లడి..

అరవింద సమేత రష్ చూశాం.. మైండ్ బ్లోయింగ్.. టెర్రిఫిక్.. మరో బ్లాక్‌బస్టర్.. క్రిటిక్ వెల్లడి..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Aravindha Sametha Movie Gets Appreciation From Critics

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అరవింద సమేతపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అజాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్‌గా తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే జై లవకుశ భారీ హిట్ తర్వాత మరో బ్లాక్‌బాస్టర్‌పై కన్నేశాడు తారక్. ఈ నేపథ్యంలో అరవింద సమేత చిత్రంపై రోజు రోజుకు అంచనాలు బీభత్సంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సినీ విమర్శకుడు ఉమెర్ సంధూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు.

   అరవింద సమేత మైండ్ బ్రోయింగ్

  అరవింద సమేత మైండ్ బ్రోయింగ్

  నాకు తెలిసిన కొందరు అరవింద సమేత రష్ ప్రింట్‌ను చూశారు. ఆ చిత్రం మైండ్ బ్లోయింగ్‌గా ఉందని చెప్పారు. యంగ్ టైగర్ గురించి మాటల్లో చెప్పలేం అని ఉమెర్ ట్వీట్ చేశారు.

  ఎన్టీఆర్ టెర్రిఫిక్‌గా ఉన్నాడు..

  అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయింది. కొత్త అవతారం టెర్రిఫిక్‌గా ఉన్నాడు. టాలీవుడ్‌కు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ ఖాయమని తెలిసింది అని ఉమేర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్

  ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్

  ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టిన తారక్ సరికొత్తగా ఫ్యాన్స్‌కు కనువిందు చేశాడు. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించడం ఖాయమంటున్నారు.

  ఎన్టీఆర్ రెండు రకాల షేడ్స్‌తో

  అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనేది టాక్. ఈ చిత్రంలో రాయలసీమ భాష పక్కగా మాట్లాడేందుకు ఎన్టీఆర్ ప్రత్యేకంగా కృష్ణార్జున యుద్ధం ఫేం పెంచల్ దాస్ వద్ద శిక్షణ తీసుకొంటున్నట్టు తెలిసింది.

   దుమ్మురేపిన ప్రీ రిలీజ్ బిజినెస్

  దుమ్మురేపిన ప్రీ రిలీజ్ బిజినెస్

  అరవింద సమేత చిత్రం విడుదలకు ముందే అనేక సంచలనాలకు వేదికగా నిలుస్తున్నది. డిస్ట్రిబ్యూషన్ హక్కులను సుమారు 80 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఎస్ రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. దసరా పండుగ కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కానున్నది.

  English summary
  The upcoming Jr NTR and Trivikram Srinivas combination film may be at the shooting stage, but pre-release business is already doing very well. In this occassion, Critic Umair Sandhu tweeted that.. BREAKINGNEWS: Saw Some Rush Prints of Aravinda Sametha & it's Just MINDBLOWING ! JrNTR looking TERRIFIC in new avatar ! Sure Shot Blockbuster on the way. Aravinda Sametha Veera Raghava !!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more