కడప మేయర్ తో బాలకృష్ణ చిత్రం ఖరారు
కడప మేయర్ రవీంధ్ర నాధ్ రెడ్డి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం త్వరలో రూపొందనుందని సమాచారం. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ మేరకు బాలకృష్ణతో చర్చించి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ కొత్త రైటర్ చెప్పిన కథను ఓకే చేసిన నిర్మాత బాలయ్యను ఒప్పించారు. ఇక ఈ చిత్రాన్ని జయంత్ సి పరాంన్జీ దర్శకత్వంలో రూపొందించనున్నారు. గతంలో జయంత్ దర్సకత్వంలో లక్ష్మీ నరసింహా, అల్లరి పిడుగు చిత్రాలు వచ్చాయి. లక్ష్మీ నరసింహా చిత్రం మంచి విజయం సాధించగా, అల్లరి పిడుగు చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక బాలకృష్ణ తన తాజా చిత్రం శ్రీరామ రాజ్యం విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాపు దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం రేపు విడుదల కానుంది. అలాగే బాలకృష్ణ ..పరుచూరి మురళి దర్శకత్వంలో అధినాయకుడు చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రంలో తండ్రిగా, తాతగా, మనవడుగా కనపించనున్నారు. ఆ గెటప్స్ కు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. అధినాయకుడు అనంతరం ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











