Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'దబాంగ్' బ్యూటీ ప్లాన్.. మెగా హీరోతో రొమాన్స్!
తెలుగు సినిమాలపై రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా క్రేజ్ మరింత పెరుగుతోంది. టాలీవుడ్లో ఓ కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే యావత్ దేశం మొత్తం తెలుగు సినిమావైపే ఆసక్తిగా చూస్తుండటం గమనిస్తున్నాం. దీంతో ఇతర భాషల్లోని హీరోయిన్స్ టాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నట్లుగా సాగిన హీరోయిన్ల ప్రయాణం.. ఇప్పుడు బాలీవుడ్ టు టాలీవుడ్ అన్నట్లుగా మారింది.
ఇప్పటికే కియారా అద్వానీ, ఆలియా భట్, విద్యా బాలన్ లాంటి ఫేమస్ హీరోయిన్స్ టాలీవుడ్ సినిమాల్లో నటించగా.. తాజాగా ఈ జాబితాలో 'దబాంగ్' పాప సయీ మంజ్రేకర్ కూడా చేరింది. సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన దబాంగ్ 3 సినిమాలో సోనాక్షిసిన్హాతో పాటు సయీ మంజ్రేకర్ ఓ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్లో ఇదే ఆమె మొదటి సినిమా కూడా.
నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ముద్దుల కూతురు సయీ మంజ్రేకర్ ఈ చిత్రంతోనే హీరోయిన్గా బాలీవుడ్ గడప తొక్కింది. ఇప్పుడు వెంటనే టాలీవుడ్ వైపు కూడా చూస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ ఛాన్స్ పెట్టేసిందట.
అల్లు అరవింద్ పెద్దకుమారుడు అల్లు వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్.. బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో వరుణ్‌తేజ్ తో పాటు ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండగా, అందులో ఒకరిగా సయీ మంజ్రేకర్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ బాలీవుడ్ భామకు టాలీవుడ్ ఏ మేర కలిసొస్తుందో!.