Daggubati Abhiram Marriage: భిన్నంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. ఎక్కడ ప్లాన్ చేశారో తెలుసా?
టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది. మొన్నటి వరకు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి జరిగింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ లో రాధ కూతురు కార్తిక పెళ్లి, బాలీవుడ్ లో సెలబ్రెటీల పెళ్లి సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ లో దగ్గుబాటి ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లికి రెడీ అయిపోయాడు. అయితే ఈయన పెళ్లిని దగ్గుబాటి కుటుంబం భిన్నంగా ప్లాన్ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దగ్గుబాటి వారింట పెళ్లి సందడికి అంతా సిద్ధం అయింది. దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండో కుమారుడు, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ సైలెంటుగా పెళ్లకి సిద్ధం అయ్యాడు. త్వరలోనే ఈ కుర్ర హీరో ఓ ఇంటివాడు అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 6న అభిరామ్ వివాహం జరగబోతోందని తెలుస్తోంది. బంధువులమ్మాయి ప్రత్యూషతో దగ్గుబాటి వారి అబ్బాయి ఏడు అడుగులు వేయనున్నాడు.

దగ్గుబాటి అభిరామ్ పెళ్లి కోసం దగ్గుబాటి కుటుంబం భిన్నంగా ప్లాన్ చేసింది. అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అది కూడా ఎవరూ ఊహించని విధంగా పెళ్లికి రెడీ అయిపోయాడు అభిరామ్. ఇంతకీ వివాహం ఎక్కడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అభిరామ్ పెళ్లి రావణ రాజ్యం శ్రీలంకలో జరగబోతుంది. ఇది తెలుసుకున్న దగ్గుబాటి ఫ్యాన్స్ ఇదేంది అక్కడ ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సెలబ్రిటీలంతా ఇటలీ, రాజస్థాన్ వంటి ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటుంటే... అభిరామ్ మాత్రం కాస్త కొత్తగా తన పెళ్లిని శ్రీలంకలోని ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ లో పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయని సమాచారం. హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో మొత్తం మూడు రోజుల పాటు పెళ్లి వేడుక జరగనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దగ్గుబాటి అభిరామ్ పెళ్లి డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు జరగనుంది.

దగ్గుబాటి అభిరామ్, ప్రత్యష పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరు కానున్నారు. వీరి సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ప్రత్యూష మెడలో అభిరామ్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇరు వర్గాల బంధుమిత్రులు, సినీ-రాజకీయ సెలబ్రిటీలతో సహా అభిరామ్ పెళ్లిలో మొత్తం 200 మంది హాజరు కానున్నారని తెలుస్తోంది. అలాగే ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు సోమవారమే శ్రీలంక వెళ్లనున్నారని సమాచారం.
మంగళవారం ఉదయం సంగీత్, సాయంత్రం మెహందీ కార్యక్రమాలను ప్లాన్ చేయగా... బుధవారం ఉదయం పెళ్లికూతురు-పెళ్లికొడుకు ఫంక్షన్ జరపనున్నారు. సాయంత్రం నుంచి పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. ఇక వివాహం అయిన వెంటనే అంతా హైదరాబాద్ కు రానున్నారని తెలుస్తోంది. ఇక్కడ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా, అభిరామ్ ఇప్పటికే అహింస మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆడలేదు.


Click it and Unblock the Notifications











