హర్రర్ కామెడీ లో హీరోగా దగ్గుపాటి రానా

By Srikanya

హైదరాబాద్: దగ్గుపాటి రానా మరో చిత్రం కమిటయ్యాడని సమాచారం. రవిబాబు తాజాగా రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న అవును చిత్రం సీక్వెల్ లో రానా ని హీరోగా తీసుకున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు రీసెంట్ గా కథ వినిపించరాని,రానా, ఆయన తండ్రి సురేష్ బాబు ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇది కూడా హర్రర్ చిత్రం అని వినిపిస్తోంది. రానా ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు చేస్తున్నారు.

నట, దర్శకుడు రవిబాబు సినిమాలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆయన ఏం సినిమాలు ఫ్లాఫు తీసినా, హిట్ తీసినా మినిమం ఓపినింగ్స్ అందుకే ఉంటాయి. దర్శకుడుగా తనదైన ముద్ర వేసుకున్న ఆయన లడ్డుబాబు చిత్రంతో కాస్త వెనక పడ్డారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన మరో హిట్ కోసం సైలెంట్ గా వర్క్ చేసుకుంటున్నారు. ఆ సినిమా తన హిట్ సినిమా కు సీక్వెల్ కావటం విశేషం. అది మరేదో కాదు... పూర్ణ ప్రధానపాత్రలో తీసిన 'అవును'చిత్రం. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రవిబాబు బిజీగా ఉన్నారు.

Daggubati Rana for Ravibabu Avunu 2

'అవును-2'టైటిల్ తో రవిబాబు ఈ సీక్వెల్ ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన తన సొంత బ్యానర్ ప్లయింగ్ ప్రాగ్స్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసారు. త్వరలోనే అఫీషియల్ గా ఈ చిత్రంపై ప్రకటన రానుంది. తక్కువ బడ్జెట్ లో రూపొంది, మంచి విజయం సాధించినట్లుగానే ఈ సీక్వెల్ ని కూడా అదే విథంగా జాగ్రత్తగా ప్లాన్ చేసి,తక్కువ రోజుల్లో, క్వాలిటితో జనాలను భయపెట్టాలని రవిబాబు నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

ఇంతకీ 'అవును'కథ ఏమిటంటే... కొత్తగా పెళ్లైన మోహిని(పూర్ణ) తన భర్త హర్ష(హర్షవర్దన్ రానే) తో కలిసి హైదరాబాద్ గండిపేట దగ్గరలో 'క్లాసిక్ హోమ్స్'లో దిగుతాడు. అయితే ఆ ఇంటిలోకి చేరిన దగ్గరనుంచి రకరకాల వింత అనుభవాలు ఎదురౌతూంటాయి. ముఖ్యంగా ఆమెను ఎవరో వెనక నుంచి గమనిస్తున్నట్లు, తను బట్టలు మార్చుకునేటప్పుడు ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు ఫీలవుతూంటుంది. ఈ నేపధ్యంలో చనిపోయిన తన తాతతో మాట్లాడే...ప్రక్కింటి పిల్లాడు విక్కి ద్వారా తమ ఇంట్లో కెప్టెన్ రావు ఆత్మ ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే ఈ లోగా ఈ తల నొప్పులు నుంచి తప్పించుకోవటానికి ప్యారిస్ కు హానీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే అప్పటినుంచి ఆ ఆత్మ లేదా దెయ్యం తన విశ్వరూపం చూపెడుతుంది. ఈ నేపధ్యంలో ఆ జంట ఏం చేసారు. ఇంతకీ కెప్టెన్ రావు ఎవరు వంటి విషయాలతో క్లైమాక్స్ రూపొందించారు.

డైరక్టర్ రవిబాబు ఎప్పటిలాగే తనదైన శైలిలో మీడియం బడ్జెట్ లో కొత్త తరహా సినిమాను,అదీ పాటలు లేకుండా తెలుగులో అందించాలని ప్రయత్నించారు. సినిమాలో చాలా భాగం ఒకే ఇంటిలో షూట్ చేసినా ఆ పీల్ రాకుండా కెమెరా తో చేసిన మ్యాజిక్ చాలా సార్లు అబ్బుర పరుస్తుంది. ఇక ఈ సినిమాలో హైలెట్ స్క్రీన్ ప్లే, సీన్స్ ను ఎక్కడా లాగ్ కాకుండా జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్లారు. అలాగే సస్పెన్స్ ఎక్కడా సడలకుండా నడిపారు. నటీనటుల్లో పూర్ణ ఈ సినిమాకు ప్లస్. ఆమే పూర్తిగా సినిమాను మోసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ హర్రర్ అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X