ఇద్దరు డైరెక్టర్లతో వెంకటేష్ మాటామంతీ.. అసలు మ్యాటర్ ఇదే!

టాలీవుడ్‌లో యంగ్ హీరోలు ఎంతమంది ఎంటరైనా సీనియర్ హీరోల హవా మాత్రం అస్సలు తగ్గటం లేదు. ఓ వైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ, ఇంకోవైపు నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉండగా మరో సీనియర్ హీరో వెంకటేష్ తన హవా కొనసాగిస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న ఈ విక్టరీ వీరుడు.. తాజాగా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడని తెలుస్తోంది.

దాదాపు రెండేళ్ల క్రిందట గురు సినిమా ద్వారా తనలోని కొత్త ప్రతిభను బయటపెట్టిన వెంకటేష్.. యంగ్ భామ రితికా సింగ్‌కి గురువుగా మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిత్రంలో వెంకీ నటన, కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.

Daggubati Venkatesh committed with two young directors

ఈ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రస్తుతం అల్లుడు నాగచైతన్యతో 'వెంకీ మామ' గా సెట్స్ పై చురుకుగా కదులుతున్నాడు వెంకటేష్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ మిలిటరీ ఆఫీసర్‌గా, వెంకీ సొంత ఊరిలో వ్యవసాయం చేసే మోడ్రన్ రైతుగా చాలా భిన్నమైన పాత్రలు చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో ఇక తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు వెంకటేష్. ఈ నేపథ్యంలో తాజాగా వెంకీ ఇద్ద‌రు యంగ్ డైరెక్ట‌ర్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. 'పెళ్లి చూపులు' డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌తో వెంకీ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతోంది. అలాగే ''సినిమా చూపిస్తా మావ, నేను లోక‌ల్‌'' చిత్రాల ద‌ర్శ‌కుడు నక్కిన త్రినాథ‌రావుతో వెంకీ మరో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా వినోదాత్మ‌కంగా ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ మేరకు ఆ ఇద్దరు డైరెక్టర్లతో వెంకటేష్ మాటామంతీ కూడా జరిగిపోయిందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X