విక్టరీ వెంకటేష్‌కు అలాంటి సమస్య: దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్న డైరెక్టర్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. సంక్రాంతి కానుకగా రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్లనూ అంతే స్థాయిలో కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో 'F3' పేరిట దానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. అంతేకాదు.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పాత్ర హైలైట్‌గా ఉంటుందట. దీనికి కారణం అతడు రే చీకటితో బాధ పడే వ్యక్తిగా కనిపించడమేనని తెలిసింది. మరీ ముఖ్యంగా సెకెండాఫ్‌లో వచ్చే అతడి ట్రాక్ కడుపుబ్బా నవ్విస్తుందని టాక్.

Daggubati Venkatesh Eye Problem Highlight in F3

గతంలో ఇలాంటి పాత్రలను పలువురు కమెడియన్లు పోషించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా స్టార్ హీరో చేయిస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే దీనికి సంబంధించిన పార్ట్ మొత్తం షూట్ చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర కూడా చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 'F2'ను మించిన ఫన్ ఇందులో క్రియేట్ చేస్తున్నారని అర్థం అవుతోంది. దీన్ని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X