అసురన్ రీమేక్ రెగ్యులర్ షూట్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
తమళనాట సంచలన విజయం సాధించిన 'అసురన్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నారు. ఆయన నిర్మాణంలోనే రూపొందనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించనున్నాడు.
ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్ర రెగ్యులర్ షూట్ జనవరి 20 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ మేరకు అందుకు తగ్గ లొకేషన్స్ వేటలో చితయూనిట్ పడిందని తెలుస్తోంది.

ఈ మేరకు తొలి షెడ్యూల్ అనంతపురంలో షూట్ ఛేష్యాలని భావిస్తున్నారట. ఆ వెంటనే హైదరాబాద్ లోనూ కొంతమేర షూటింగ్ జరుపనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లొకేషన్లు కూడా ఫైనల్ చేశారట. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసి ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనేది ప్లాన్ అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ జోడీగా ప్రియమణి నటించనుండటం విశేషం. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారట. చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. వెంకీమామ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్.. అదే జోష్‌లో 'అసురన్' రీమేక్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications











