twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వెంకీమామ'లో ఆ 40 నిమిషాలు.. హైలైట్ సన్నివేశాలివే!

    |

    మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రాబోతున్న మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఫ్యామిలీ, ఎమోషన్ డ్రామాకు కామెడీ జోడించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ బాబీ.

    ఇక ఈ సినిమాలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండగా, వెంకటేష్ రైతుగా నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ మామఅల్లుళ్లుగా నటిస్తున్నారు. చిత్రంలో ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు హైలైట్ కానున్నాయని తెలిసింది. ముఖ్యంగా కాశ్మీర్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చేసిన 40 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుందని లేటెస్ట్ సమాచారం. ఈ 40 నిమిషాల పాటు థియేటర్‌లో ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారని తెలుస్తోంది.

    Daggubati Venkateshs Venky Mama movie Hilight Episodes

    ఇక ఇప్పటికే విడుదలైన 'వెంకీమామ' సినిమా టీజర్‌కి, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    English summary
    Daggubati Venkatesh and Naga Chaitanya playing lead roles in Venky Mama movie. This movie having huze demand and getting huze market for pre release as per latest source. As per latest talk in this movie the 40 min kashmir episode will be hilighted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X