మరో మల్టీస్టారర్‌కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్.. ఈ సారి స్టార్ హీరోతో కలిసి నటిస్తున్నాడు
ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో విక్టరీ వెంకటేష్ కొంత ప్రత్యేకమనే చెప్పాలి. మూవీ మొఘల్ డీ రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ పక్కింటి అబ్బాయిలా మారిపోయాడు. ఏజ్ బార్ అయిన తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అంతేకాదు, ఎంతో మంది యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే వెంకటేష్ మరో మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

అల్లుడితో కలిసి హిట్ కొట్టాలని
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్.. తన మేనల్లుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు ‘జై లవ కుశ' వంటి హిట్‌ను తెరకెక్కించిన బాబీ దర్శకుడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హిట్ కొట్టాలని మామా అల్లుడు పట్టుదలతో ఉన్నారు.

ఆ రీమేక్‌తో వస్తున్నాడు
ఈ సినిమా తర్వాత వెంకటేష్ ‘అసురన్' రీమేక్‌లో నటించనున్నారు. తమిళంలో సూపర్ స్టార్ ధనుష్ నటించిన చిత్రం ‘అసురన్'. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ధనుష్ తండ్రిగా, కొడుకుగా కనిపించి మెప్పించ్చాడు. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న ఈ సినిమాకు వెంకీ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మల్టీస్టారర్ స్పెషలిస్ట్ ఈయనే
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ అంటే వెంకటేష్ పేరే ప్రథమంగా అందరికీ గుర్తొస్తుంది. ఆయన గతంలో మహేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల', యంగ్ హీరో రామ్‌తో ‘మసాలా', వరుణ్ తేజ్‌తో ‘F2' అనే సినిమాల్లో నటించారు. తన పాత్ర పరిధి తక్కువుందా..? ప్రాధాన్యత ఉందా..? అనేవి పట్టించుకోకుండా సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత.

మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్
వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ' విడుదల కాకముందే ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. రచయిత ఆకుల శివ ఇటీవల సురేష్ బాబుకు ఓ కథను వినిపించారట. ఈ కథ వెంకటేష్‌కు సరిపోతుందని, ఆయనతో పాటు ఇంకో యంగ్ హీరోను తీసుకోవాలని ఈ ఇద్దరు చర్చించుకున్నారని సమాచారం.
Recommended Video

వెంకటేష్‌తో మరో స్టార్ హీరో
ఈ సినిమాలో వెంకటేష్‌తో కలిసి నటించబోయే స్టార్ మరెవరో కాదు.. సహజ నటనతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న నాని అని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అతడు ‘వీ', ‘టక్ జగదీష్' అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ముగియడంతో పాటు, వెంకటేష్ అసురన్ రీమేక్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 20121లో ఈ మల్టీస్టారర్ స్టార్ట్ అవుతుందని వినికిడి.


Click it and Unblock the Notifications











