నాగార్జున ఎఫెక్ట్ వెంకటేష్‌పై పడిందా..? హాట్ టాపిక్ అవుతున్న లేటెస్ట్ ఇష్యూ..
అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ ఇద్దరిదీ ఒక్కో స్టైల్. ఇద్దరికీ అంతులేని అభిమాన వర్గం. సీనియర్ హీరోలుగా నేటికీ హ్యాండ్‌సమ్ లుక్‌లో వెండితెరపై రాణిస్తున్నారు ఈ ఇద్దరూ. పైగా నిజ జీవితంలో వీళ్ళిద్దరూ రెలెటివ్స్ కూడానూ. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నాగార్జున ఎఫెక్ట్ వెంకటేష్‌పై పడిందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా ఎఫెక్ట్? జనాల్లో నడుస్తున్న టాక్ ఏంటి? వివరాల్లోకి పోతే..

'మన్మథుడు 2' లో నాగార్జున రొమాన్స్
ఇటీవలే విడుదలైన 'మన్మథుడు 2' సినిమాలో నాగార్జున రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. సీనియర్ హీరో అయిన ఈయన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో మన్మథుడిగా సరసాలాడారు. దీంతో సినిమాకు ఒకరకంగా హైప్ క్రియేట్ అయినప్పటికీ, నాగార్జునను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు నెటిజన్లు. చివరకు సినిమా కూడా ఆశించిన ఫలితం రాబట్టలేదు.

వెంకటేష్‌పై ఇదే ఎఫెక్ట్ ప్రభావం చూపుతోందా..?
అయితే నాగార్జున 'మన్మథుడు 2' అంశమే విక్టరీ వెంకటేష్‌పై ప్రభావం చూపుతోందని టాక్ వినిపిస్తోంది. నాగార్జున ఎఫెక్ట్ కారణంగానే వెంకటేష్ తనకు వచ్చిన ఓ ఆఫర్ వదులుకున్నారట. అరె! ఇదెక్కడి వింత.. ఆశ్చర్యంగా ఉంది కదూ!. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే అని తెలుస్తోంది.

దే దే ప్యార్‌దే రీమేక్.. ఊహించని విధంగా 'నో'
హిందీలో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా ఇటీవలే విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది ‘దే దే ప్యార్‌దే' సినిమా. దీంతో ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. వెంకటేష్ కూడా ఈ సినిమా రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డైరెక్టర్ శ్రీవాస్ తెలుగు నేటివిటీకి కావాల్సిన మార్పులు చేర్పులు చేసి బౌండెడ్ స్క్రిప్ట్‌తో వెంకటేష్‌ని కలవడంతో ఆయన ఊహించని విధంగా 'నో' చెప్పారట. ఈ ఇష్యూ ఫిలింనగర్ సిర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

అసలు కారణమిదే..
అయితే వెంకటేష్ నో చెప్పేందుకు అసలు కారణం నాగార్జున 'మన్మథుడు 2' సినిమానే అని తెలుస్తోంది. దే దే ప్యార్‌దే సినిమాలో కూడా సీనియర్ హీరో యంగ్ హీరోఅయ్యిం తో రొమాన్స్ చేస్తాడు. సో ఇలాంటి సినిమా రీమేక్ చేస్తే తాను కూడా నాగార్జున లాగే ట్రోల్స్ బారిన పడుతానేమో, నెగెటివ్ ఇంప్రెషన్ పడుతుందేమో అని వెంకటేష్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నాగ చైతన్యతో వెంకీమామ
మరోవైపు నాగ చైతన్యతో 'వెంకీమామ' సినిమాలో నటిస్తున్నాడు వెంకటేష్. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











