నాగ్ 'డమరుకం' ఫైనల్ రిలీజ్ డేట్ ??
హైదరాబాద్ : నాగార్జున హీరోగా చేసిన 'డమరుకం' విడుదల తేధీ పైనల్ గా పిక్సయ్యైదని సమాచారం. ఈ చిత్రం నవంబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నాగార్జున ఈ విడుదల విషయంలో కలగచేసుకుని, క్లియర్ చేయటానికి సహకరించినట్లు చెప్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీని నిర్మాతలు ఖరారు చేస్తూ ప్రకటన చేయాల్సి ఉంది. ఈ విడుదల విషయమై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉండటమే దీనికి కారణం.
నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నాగార్జున ఈ చిత్రం పై మంచి కాన్పిడెంట్ గా ఉన్నారు..ఆయన మాట్లాడుతూ..."డమరుకం చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతం. 'ఈగ' స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని మించి 'డమరుకం' ఉంటుంది'' అని చెప్పారు. ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ.. ''నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా గ్రాఫిక్స్ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కించాము''అని ధర్శకుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











