పవన్ ఎఫెక్ట్ తో నాగార్జున సినిమా వెనక్కి

By Srikanya

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ తాజా చిత్రం'కెమెరామెన్ గంగతో రాంబాబు', నాగార్జున ఢమురకం చిత్రాలు ఒకదానికి మరొకటి పోటీ పడుతాయనే వార్తలు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. దసరా సెలవులను క్యాష్ చేసుకోవటానికి రెండు చిత్రాలు ఒక రోజు తేడాలో రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. అయితే ఇప్పుడు నాగార్జున సినిమా వెనక్కి తగ్గిందని సమాచారం. అక్టోబర్ 12 అనుకున్న ఈ తేదీని అక్టోబర్ 18కి మార్చినట్లు తెలుస్తోంది. భాక్సాఫీస్ వద్ద 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రిజల్ట్ ని బట్టి ఆ డేట్ మరింత ముందుకు వెళ్తుందా లేదా అని తేలుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అఫీషియల్ గా నిర్మాతలు తేదీ నిర్ణయించలేదు

నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం ఢమరుకం. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. 'డమరుకం'గురించి నాగార్జున మాట్లాడుతూ... శివుడికీ, మనిషికీ మధ్య సాగే సోషియో ఫాంటసీ కథాంశం. అలాగని భక్తి, ఆధ్యాత్మికం తరహా విషయాలేవీ ఇందులో ఉండవు. పక్కా మాస్‌ సినిమా. 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి. 'డమరుకం' మే నెలలోనే విడుదల కావాలి. గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైంది. నిన్ననే కొంత పోర్షన్ గ్రాఫిక్స్ చూశా. అద్భుతంగా ఉంది. ఒక పాట షూట్ చేయాలి అన్నారు.

అలాగే మంచి మాస్, కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది. నాకిదే తొలి సోషియో ఫాంటసీ సినిమా. 'డమరుకం' సిజి వల్లే ఆలస్యం అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలోని 'డమరుకం' చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ రాజీ లేకుండా ఖర్చు చేస్తున్నారీ సినిమాకి. సోసియోఫాంటసీ కథలో మాస్‌ మసాలాను అద్భుతంగా మిక్స్‌ చేసి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నాగార్జున 25ఏళ్ల కెరీర్‌లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. బ్యాలెన్స్‌ పాటను ఈ నెల 30నుంచి చిత్రీకరిస్తున్నారు.

సెప్టెంబర్‌ 10న ఆడియో, అక్టోబర్‌ 12న సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2012నాటికి ప్రపంచం ఉండదు..అనే కాన్పెప్టుతో హాలీవుడ్‌ సినిమాలెన్నో వచ్చాయి. ఆ తరహా చిత్రమిది. గ్రహాల తీరుపెై స్పృషించారు. బొట్టు శీను తరహా మాస్‌ పాత్ర మరో హైలెైట్ . తాను, నాగచైతన్య, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించే సినిమా చిత్రం గురించి చెపుతూ..విక్రమ్‌ కె.కుమార్‌ కథ చెప్పాడు. నాక్కూడా బాగా నచ్చింది. అయితే ఆ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి అన్నారు నాగార్జున. అలాగే బెల్లంకొండ సురేష్ తో ఆయన త్వరలో ఓ చిత్రం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X