షాకింగ్: అమీర్ ఖాన్ కూతురు సినిమాలకు దూరమైంది అందుకా..?

బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ 2016లో నటించిన 'దంగల్' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమాలో నటించిన అమీర్ ఖాన్, బాలనటులతో పాటు లీడ్ రోల్ చేసిన నటులకు చక్కని గుర్తింపు కూడా లభించింది. ఇందులో జైరా వసీమ్ ఒకరు.

'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన జైరా వసీమ్.. చక్కని అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత మరో సక్సెస్‌ఫుల్ మూవీ 'సీక్రెట్ సూపర్‌స్టార్'లో సైతం మెప్పించి పలు అవార్డులను అందుకుంది. అయితే, ఊహించని రీతిలో ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఇటీవల ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా లేఖను విడుదల చేసి మరీ వెల్లడించింది.

Dangal actor Zaira Wasim Sings For Bigg Boss

''సరిగ్గా ఐదేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి ఎంటరయ్యాను. సినిమాల్లో నటించడం ద్వారా తక్కువ సమయంలోనే గొప్ప పేరు, ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నా. అయినప్పటికీ ఇంత మంచి స్ధానాన్ని కల్పించిన బాలీవుడ్‌ను విడిచిపెడుతున్నాను. నా మత విశ్వాసాలను గౌరవిస్తూనే సినిమా రంగానికి దూరంగా వెళ్తున్నా'' అని ఆ లేఖలో పేర్కొంది. దీంతో బాలీవుడ్‌లో కలకలం రేగింది.

మత విశ్వాసాలను గౌరవిస్తూనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని చాలా మంది అనుకున్నారు. కానీ, జైరా సినిమాల నుంచి తప్పుకోవడానికి అసలు కారణం 'బిగ్‌బాస్' అనే టాక్ వినిపిస్తోంది. హిందీలో సంచలనం రేకెత్తించిన ఈ షోను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే 12 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. 13వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇందులో పాల్గొనడం కోసమే జైరా సినిమాల నుంచి తప్పుకుందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, 'బిగ్‌బాస్'లో పాల్గొనడం కోసం ఆమెకు అక్షరాల రూ. కోటిన్నర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఆమె నటించిన 'ద స్కై ఈజ్ పింక్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా, ఫరాన్ అక్తర్ లీడ్ రోల్స్ పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X