Sir ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా హీరోలతో చర్చలు.. పవన్, చిరు ఇద్దరిలో ఎవరు?

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ నటించిన సార్ మూవీ తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. అసలైతే ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలోని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా భారీ స్థాయిలోనే తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ లో నాగ వంశీ నిర్మించారు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దేవ్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్టర్ చేశాడు. ధనుష్ ఒక తెలుగు దర్శకుడి తో వర్క్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాతో ఎలాగైనా ధనుష్ తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక అగ్ర హీరోను తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నారు.

Danush sir movie pre release event latest update on chief guest

ముఖ్యంగా మొదట అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. గతంలో కూడా ధనుష్ చాలాసార్లు సోషల్ మీడియాలో తనకు తెలుగులో అభిమాన హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు అని ట్వీట్స్ కూడా చేశాడు. ఇక తప్పకుండా ధనుష్ కోసం పవన్ కళ్యాణ్ రావచ్చు అని అందులోను సీతార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీతో మంచి అనుబంధం ఉంది కాబట్టి పవన్ వస్తాడని అందరూ అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. పవన్ కాస్త బిజీగా ఉండడంతో ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ధనుష్ సినిమాలంటే కూడా చాలా ఇష్టమని మెగాస్టార్ గతంలో తెలియజేశారు. మరి ఇప్పుడు సార్ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X