Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘దరవు’ దర్శకుడి రేటు అంతా...?
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'దరువు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శివ రెమ్యూనరేషన్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈ చిత్రానికి గాను అతడు రూ. 2.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. సగటు తెలుగు సినిమా దర్శకుడు ఈ మొత్తం తీసుకోవడం విచిత్రమేమీ కాదు కానీ.... తక్కువ సినిమాలు చేసి ఈ రేంజ్లో ఫ్యాన్సీ అమౌంట్ పుచ్చుకుంటుండటంపై కొందరి నుంచి ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
రవితేజ శివతో కలిసి పని చేయడంపై చాలా సంతృప్తిగా ఉండటంతో నిర్మాత కూడా ఏమాత్రం ఆలోచించకుండా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందు వచ్చాడని అంటున్నారు. గతంలో శివ... గోపీచంద్ హీరోగా 'శౌర్యం' సినిమాకు దర్శకత్వం వహించారు. 'దరువు' చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.
రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ