దసరా దర్శకుడికి స్టార్ హీరో నుంచి పిలుపు.. అంత పెద్ద స్టార్ ఛాన్స్ ఇస్తాడా?
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఏప్రిల్ 30వ తేదీన గ్రాండ్ గా ప్లాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ దగ్గర పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేసిన శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఇక మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకుని చిత్ర యూనిట్ సభ్యులకు మంచి బూస్ట్ అయితే ఇచ్చింది.
శుక్రవారం శనివారం కాస్త కలెక్షన్స్ తగ్గినప్పటికీ కూడా సినిమా మరికొన్ని రోజుల్లో అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ కూడా అందుకుంటుంది అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈ సినిమా చూసినా కొంతమంది స్టార్ హీరోలు పాజిటివ్ గా స్పందించారు.

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే సినిమా అద్భుతంగా ఉంది అని చిత్ర యూనిట్ సభ్యులు వర్క్ చేసిన విధానాన్ని చూసి గర్వపడుతున్నాను అని కూడా ఆయన వివరణ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దసరా సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు ప్రత్యేకంగా దర్శకుడు శ్రీకాంత్ ను పిలిపించుకొని మరి అభినందించినట్లు సమాచారం. అంతేకాకుండా అతనికి సినిమా చేసే ఆఫర్ కూడా ఇవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియాలో అయితే కథనాలు వెలువడుతున్నాయి.
సాధారణంగా మహేష్ బాబు మంచి కంటెంట్ తో ఉన్న సినిమా ఏది వచ్చిన కూడా ప్రత్యేకంగా చూసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందిస్తూ ఉంటారు. అంతేకాకుండా సినిమా నచ్చితే దర్శకులకు అవకాశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు శ్రీకాంత్ పనితనం కూడా మెచ్చిన మహేష్ బాబు కథలు ఉంటే రెడీ చేయమని చెప్పారట.
అంతేకాకుండా తన సొంత ప్రొడక్షన్ జిఎంబి ప్రొడక్షన్లో కూడా సినిమా చేసే ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మహేష్ బాబు శ్రీకాంత్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అప్పుడే ప్రచారాలు మొదలుపెట్టేశారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలుసిందే.


Click it and Unblock the Notifications











