దాసరి-బాలయ్య ‘పరమవీర చక్ర’పై ‘మెగా’ కుట్ర..
'పరమవీర చక్ర" చిత్రాన్ని విడుదల కాకుండా చూడాలని తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని శక్తులు ప్రయత్నించాయని, కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు కాబట్టి, అనుకున్న సమయానికే ఈ చిత్రం విడుదలవుతోందని దాసరి నారాయణరావు పేర్కొనడం చర్చనీయాంశమయింది. చిత్ర పరిశ్రమ చేసిన సమ్మె కేవలం ఈ చిత్రాన్ని అడ్డుకోవడానికి చేసిన కుట్ర అన్నట్టు దాసిర అభివర్ణించారు. నిజానికి మిగతావాళ్లంతా షూటింగులు ఎక్కడివక్కడ ఆపేస్తే.
దాసరి మాత్రం దొడ్డిదారిలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయించారు. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండడంతో ఆయన ఇక్కడ ఉండిపోయి కొరియోగ్రాఫర్లతో పాటు యూనిట్ ని విదేశాలకి పంపించి బ్యాలెన్స్ ఉన్న పాటలు పూర్తి చేయించారు. ఇది వివాదస్పదమైన దాసరికి పలువురు ఎదురు తిరిగారు. అంతా సంఘీభావం ప్రకటిస్తే మీరొక్కరు మాత్రం ఇలా చేయడమేంటని నిలదీశారు. దానిని దాసరి తనకి అనుకూలంగా ట్విస్ట్ చేసి, తనికి శత్రువర్గం అనగానే గుర్గుకొచ్చే వాళ్ల మీదకు బాణాన్ని ఎక్కుపెట్టారు.


Click it and Unblock the Notifications











