దాసరి నారాయణరావు చీప్ ట్రిక్స్ ‘పరమవీర చక్ర’ను నడిపిస్తాయా...
'పరమవీర చక్ర" చిత్రం రిలీజ్ అవకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు" అంటూ దాసరి నారాయణరావు శ్రేయోభిలాషి నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ స్టేట్ మెంట్ విన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఆ సినిమాని ఎవరు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డుకుంటారు. అతని మాటల్ని బట్టి చిరంజీవి ఈ వ్యవహారం లో ముందున్నారని అర్థమవుతుంది. కానీ, చిరంజీవికి ఆ అవసరం వుందంటారా? మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవడం లేదు. అలాంటప్పుడు అతన్ని టార్గెట్ చెయ్యడం కరెక్టేనా?ఇదంతా చూస్తుంటే సినిమా ప్రమోషన్ కోసం దాసరి నారాయణరావు ప్లే చేస్తున్న చీప్ ట్రిక్ ఇది అని అర్థమవుతోంది. బాలకృష్ణలాంటి పెద్ద హీరో సినిమాకి ఇలాంటి చీప్ పబ్లిసిటీ అవసరమా? ఈ పబ్లిసిటీ చూసి బాలకృష్ణ అభిమానులు కూడా నవ్వుకుంటున్నారు. ఇప్పటికే సినిమా మీద బోలెడంత నెగెటివ్ టాక్ వుండడంతో ఇలాంటి పబ్లిసిటీ స్టార్ట్ చేసారని చిరంజీవి ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











