'నటరత్న' దాసరి నారాయణరావు
మోహన్ బాబుకు, చిరంజీవికి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గమంటుందని వేరే చెప్పక్కర్లేదు. మొన్న తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో ఎవరు లెజెండ్ అన్న విషయంలో ప్రత్యక్షంగా యుద్ధానికి దిగటం, నిన్న స్టార్ నైట్ మీటింగ్ కు చాలా మంది రాలేదని విమర్శించిన మోహన్ బాబు ఎక్కడా చిరు పేరు ప్రస్తావించకున్నా, గుమ్మడికాయల దొంగెవరంటే బుజాలు తడుముకున్నట్టు చిరు దానికి చాలా ఘాటుగా జవాబివ్వడం తెలిసిందే. కానీ మోహన్ బాబు అలా మాట్లాడటానికి కారణం ఆయన వెనుకనున్న ఆయన గురువు దాసరి నారాయణరావేనని చాలా మంది చెప్పుకుంటున్నారు. చిరు ఇమేజ్ ను తగ్గించడానికే దాసరి పన్నాగం పన్ని, దాన్ని మోహన్ బాబు చేత అమలు చేయించాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.
కానీ నిన్న జరిగిన రామ్ చరణ్ మూడవ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరైన దాసరి ఎంతో ఉత్సాహంగా అందరితో మాట్లాడుతూ, చిరు కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగారు. ఇది చూసిన వారంతా మోహన్ బాబుని చిరు పైకి ఉసిగొల్పిన దాసరి ఇప్పుడు చిరు కుటుంబంతో ఇంత సన్నిహితంగా మెలుగుతున్నారేంటి అని ఆశ్చర్యపోయారంట. కొందరైతే ఆయనలో గొప్ప నటుడు వున్నాడని, ఆయనకు దర్శకరత్న అన్న బిరుదు కంటే నటరత్న అన్న బిరుదైతే బాగుంటుందని చెప్పుకోవడం కనిపించింది.


Click it and Unblock the Notifications











