టాలీవుడ్ నిర్మాతపై దాడి వెనుక దాసరి హస్తం....!?
పైరసీకి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేసి నిలిచిన నిర్మాత యలమంచిలి రవిచంద్ ఆ తర్వాత పలు వివాదాలతో పబ్లిసిటీ దక్కించుకున్నాడు. ముఖ్యంగా దాసరి నారాయణరావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. టాలీవుడ్ సమ్మెకి దాసరి కారకుడని బహిరంగంగా ఆరోపిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకి పట్టిన శని అని, దరిద్రమని దాసరిని ఉద్దేశించి రవిచంద్ కామెంట్ కూడా చేశాడు.
మాయగాడు సినిమా పబ్లిసిటీకి సహరించడం లేదని ఛార్మిపై కేసు పెట్టి కూడా వార్తల్లో నిలిచాడు. సదరు రవిచంద్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కర్రలతో కొట్టి పారిపోయారు. ప్రస్తుతం ఆయనకి చికిత్స జరుగుతోంది. అయితే రవిచంద్ ని కొట్టించేంత కసి దాసరి వర్గానికే ఉండి ఉంటుందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవిచంద్ కి పలువురితో విబేధాలున్నప్పటికీ దాసరిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమే ఇదై ఉండవచ్చునని అభిప్రాయు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











